రెమ్ డెసివర్ ఇంజక్షన్ల బ్లాక్ దందాకు పాల్పడిన ముఠా అరెస్ట్

 అవినీతి నిరోధక స్వచ్చంద సంస్థ ఇచ్చిన సమాచారంతో పోలీసుల అప్రమత్తం


వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో  రెమ్ డెసివర్ ఇంజక్షన్లను  బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతున్న ఐదుగురు సభ్యుల ముఠాను  గీసుగొండ పోలీసులు అరెస్టు  చేసారు. ప్రజాసేన అవినీతి నిరోదక స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పుప్పాల రజని కాంత్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. ఇటీవల కూడ ఈ సంస్థ రెమిడిసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయించే ముఠాను పోలీసులకు పట్టించింది. ఈ ముఠా నుండి 42 రెమ్ డెసివర్ ఇంజక్షన్లతో పాటు ఒక లక్ష 69 వేల రూపాయల నగదు, ఒక కారు, ఒక ద్వీచక్రవాహనం, ఐదు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు  చేసిన వారిలో చందా విజయ్ కుమార్,ల్యాబ్ టెక్నిషన్, బోడుప్పల్ హైదరాబాదు,చింతం రాజేష్, ఉరుగొండ గ్రామం, దామెర మండలం, వరంగల్ రూరల్ జిల్లా,ముందాటి గోపాల్, మెడికల్ రిప్రజెంటేవ్, హన్మకొండ, వరంగల్,గట్టు అవినాశ్, ల్యాబ్ టెక్నిషన్, ధర్మారం , వరంగల్ ,వావిల సురేష్,మెడికల్ షాపు, హన్మకొండ వరంగల్ ఉన్నారు.

ఈ అరెస్టు కు సంబంధించి ఈస్ట్  జోన్ డి.సి.పి వెంకటలక్ష్మి  వివరాలను వెల్లడించారు.  ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత అధికంగా వుండటంతో రెమ్ డెసివర్ ఇంజక్షన్ల వాడకం అధికం కావడంతో కొందరు వ్యక్తులు ముఠాగా ఎర్పడి హైదరాబాదు నుండి 

రెమ్ డెసివర్ ఇంజక్షన్లు ఎం.ఆర్.పి రేట్లకు కోనుగోలుచేసి  వాటిని అత్యవసరం వున్న కరోనా వ్యాధిగ్రస్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు.  శంషాబాద్  ప్రాంతం నుండి రెమ్ డెసివర్ ఇంజక్షన్ల కోనుగోలు చేసి వాటిని 28వేల రూపాయల చొప్పున అమ్మేందుకు సిద్దపడ్డారని ఇందులో భాగంగా ఈ ముఠా సభ్యులు గీసుగొండ పోలీస్ స్టేషన్  పరిధిలోని గొర్రెకుంట లోని కరోనా వ్యాధిగ్రస్తుడికి రెమ్ డెసివర్ ఇంజక్షన్లను అందజేసేందుకు  కట్టమల్లన్న గుడి వద్దకు వచ్చారని సమాచారం తెల్సి పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సూచనల మేరకు   నిందితులను పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. పోలీసులను చూసి పారి పోయే ప్రయత్నం చేయగా వెంటాడి పట్టుకున్నారని చెప్పారు. వారి నుండి ఓ కారు ఓ ద్విచక్ర వాహనం కూడ స్వాదీనం చేసుకున్నారు.

మామూనూర్ ఎ.సి.పి నరేశ్ కుమార్, గీసుగొండ ఇన్స్‌పెక్టర్  వెంకటేశ్వర్లు, ఎస్.ఐలు అబ్దుల్ రహీం, రాజు,కానిస్టేబుల్లు పవన్ కుమార్, కిషన్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు