టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలకు సుప్రీం కోర్టులో ఊరట

  దేశ ద్రోహ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు


తన వ్యతిరేక మీడియా చానెళ్లను ఊచలులెక్కపెట్టించాలనుకున్న  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  సర్కార్ పాచికలు పార లేదు.   తెలుగు న్యూస్ ఛానళ్లు టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలకు  వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు ఉపక్రమించరాదని సుప్రీంకోర్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి  ఆదేశాలు జారి చేసింది. రఘురామ కృష్ణరాజు పై మోపిన  దేశ ద్రోహం కేసులో   జగన్ సర్కార్ ఈ రెండు ఛానెళ్లను కేసుల్లో ఇరికించింది.  రఘురామ కృష్ణరాజు ను ఎపి సిఐడి పోలీసులు అరెస్ట్ చేయగా సుప్రీం కోర్టు ఆయన అరెస్టును నిలిపి వేసింది. టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెళ్లు కూడ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

ఈ ఛానెళ్ల పిటిషన్ ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ బెంచ్ లో జస్టిస్ చంద్రచూడ్ తో పాటు  జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ ఉన్నారు.

 దాంతో ఈ రెండు ఛానళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టు నిలిపివేసింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీడియా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నంలా మజిల్ మీడియా ఫ్రీడం ఉందని  వ్యాఖ్యానించింది. దేశద్రోహం చట్టానికి సంబంధించిన పరిమితులను పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ప్రతి రాష్ట్రం దేశద్రోహం కేసును దుర్వినియోగం చేస్తోందని... ఈ అంశాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని తెలిపింది. రాజద్రోహం కేసుల నమోదుపై తాము పూర్థి స్థాయిలో దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది.

రెండు ఛానళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని విచారణ సందర్భంగా ఛానళ్ల తరపు న్యాయవాదులు సుప్రీంను కోరారు. దీంతో, ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ... తదుపరి విచారణ వరకు  ఈ రెండు ఛానళ్లపై కానీ, వాటి సిబ్బందిపై కానీ ఎలాంటి బలవంతపు చర్యలకు ఉపక్రమించరాదని ఆదేశించింది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు