రజని కాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు - చుట్టు ముట్టిన రాజకీయ విమర్శలు

 భాషా ఖుష్.....



సూపర్ స్టార్ రజని కాంత్ ను కూడ రాజకీయాలు చుట్టుముట్టాయి. ఆయన రాజకీయ పార్టి ఏర్పాటు చేస్తానని పలుమార్లు ప్రకటించి వెనక్కి తగ్గడం తెల్సిందే. రజని కాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. అయితే సోషల్ మీడియాలో అయనను ఓ వైపు అభినందిస్తూనే మరో వైపు రాజకీయ విమర్శలు కూడ చేశారు. సోషల్ మీడియాలో రజని కాంత్ పై అనేక భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తమిళ నాడులో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అవార్డును ప్రకటించడం తో అవార్డుకు రాజకీయ  కోణం జత చేశారు.  

విమర్శలు పక్కన పెడితే అంతా ఎన్నికల మాయ కాక పోతే రజనికాంత్ ఈ అవార్డుకు నూటికి నూరు పాళ్లు తగిన వాడే కదా? 

 అయితే రజని కాంత్ మాత్రం తనకు అవార్డు ప్రకటించినందుకు గాను ప్రదాన మంత్రి నరేంద్ర మోదీకి జ్యూరి సబ్యులకు కృతజ్ఞతలు తెలియ చేస్తు లేఖ రాసారు. 

గౌరవనీయ ప్రధానమంత్రి వర్యులు నరేంద్రమోదీగారికి, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా లోని నటుడిని గుర్తించి.. ఎంతగానో ప్రోత్సహించిన.. నా స్నేహితుడు, బస్సు డ్రైవర్‌ అయిన రాజ్‌ బహదూర్‌.., పేదరికంలో ఉన్నా.. నాకోసం ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యానారాయణరావు గైక్వాడ్‌, నన్ను రజనీకాంత్‌గా తీర్చిదిద్దిన నా గురువు కె. బాలచందర్‌తో పాటు.. నాకు జీవితాన్ని ప్రసాదించిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌, మీడియా, డిజిటల్‌ మీడియా, అలాగే  తమిళ ప్రజలు, అభిమానులందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నాను. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వన్‌, ప్రతిపాక్ష పార్టీ నేత స్టాలిన్‌, కమల్‌ హాసన్‌లతో పాటు ఇతర రాజకీయ అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..'' అని సూపర్‌ స్టార్‌ ఈ లేఖలో తెలిపారు.

రువు కె. బాలచందర్‌తో పాటు.. నాకు జీవితాన్ని ప్రసాదించిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌, మీడియా, డిజిటల్‌ మీడియా, అలాగే  తమిళ ప్రజలు, అభిమానులందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నాను. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వన్‌, ప్రతిపాక్ష పార్టీ నేత స్టాలిన్‌, కమల్‌ హాసన్‌లతో పాటు ఇతర రాజకీయ అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..'' అని సూపర్‌ స్టార్‌ ఈ లేఖలో తెలిపారు.

అట్లాగే తన సినీ కెరియర్‌ మొదలైన క్షణాలను గుర్తుచేసుకుంటూ.. స్నేహితుడు, బస్సు డ్రైవర్‌ అయిన రాజ్‌ బహదూర్‌, ఎన్నో త్యాగాలు చేసిన నా పెద్దన్నయ్య సత్యానారాయణరావు గైక్వాడ్‌

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు