భాద్యతలు స్వీకరించిన చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌నర్ సుశీల్‌ చంద్ర‌

 


కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా  సుశీల్‌ చంద్ర బుధవారం పదవి భాద్యతలు స్వీకరించారు. ఆయన 2022 మే 14 వరకు సీఈసీగా  పదవిలో కొనసాగ నున్నారు.  కేంద్ర న్యాయశాఖ సోమవారం సుశీల్ చంద్రను 24 వ  సీఈసీగా నియమిస్తూ ఉత్తర్వులు  జారి చేసింది. ఇంత కాలం సిఈసి గా పనిచేసిన సునీల్‌ అరోరా సోమవారం పదవి విరమణ చేశారు.  దాంతో ఆయన అనంతరం సీనియర్ అధికారి అయిన సునీల్‌ అరోరా ను ఎన్నికల కమీషన్ గా నియమితులు అయ్యారు.

ఎన్నికల కమిషనర్‌గా 2019లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఆ మరుసటి ఏడాది ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. పశ్చిమ బెంగాల్ లో మరో నాలుగు విడతల పోలీంగ్ తో పాటు తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలతో పాటు తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లి స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కమిషనర్‌గా 2019లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఆ మరుసటి ఏడాది ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. సుశీల్‌ చంద్ర సారధ్యంలో ఉత్తరప్రదేశ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్,పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగ నున్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు