బిజెపీకి వ్యతిరేకంగా ఏకం కావాలన్న మమత

కాంగ్రేస్ పార్టీతో సహా ప్రాంతీయ పార్టీల నేతలందరికి లేఖలు


పశ్చిమ బెంగాల్ లో అధికారం నిలుపు కునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో హోరా హోరీగా ఒంటరి పోరాటం సాగిస్తున్న  తృణమూల్ కాంగ్రేస్ పార్టి అద్యక్షురాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జి దేశంలో ప్రతిపక్షాలన్నింటిని ఏకం చేసి బిజేపీకి వ్యతిరేక కూటమి కట్టే పనిలో పడ్డారు.

ఎన్నికల్లో క్షణం తీరిక లేని సమయంలో కూడ మమతా బెనర్జి బిజెపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేపనికి శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  దేశంలో బిజెపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని కాంగ్రేస్ పార్టీతో సహా వివిద రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలందరికి లేఖలు రాసారు.

కాంగ్రేస్ పార్టి అద్యక్షురాలు సోనియా గాంధి డిఎంకె చీఫ్ స్టాలిన్, ఎన్సీపి అధినేత శరద్ పవార్, శివ సేన అధినేత ఉద్దవ్ థాకరే, వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా మొత్తం 15 పార్టీల నేతలకు  ఆమె లేఖలు రాసారు.

లేఖల్లో బిజెపి వైఖరిని మమతా తీవ్రంగా దుయ్య బ్టటారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి బిజెపి విఘాతం కలిగించిందని విమర్శించారు. బిజెపీని వ్యతిరేకించేందుకు అందరు ఐక్యంగా చేతులు కలిపాల్సిన అవసరం ఉందన్నారు.

 ప్రధానంగా బీజెపి ఏతర రాష్ట్రాలలో  అధికారాలు కుదిస్తూ హక్కలు హరిస్తూ స్వేచ్చ లేకుండా చేస్తున్నదని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను నిర్వీర్యం చేసి మున్సిపాల్టీల స్థాయికి దిగజార్చాలని చూస్తున్నదని దుయ్య బట్టారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారాలు కుదించి లెప్ట్ నెంట్ గవర్నర్ కు అత్యధిక అధికారాలు కట్ట బెడుతు కేంద్రం తీసుకు వచ్చిన కొత్త చట్టాన్ని లేఖలో ప్రస్తావించారు. దేశంలో ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలిగేలా కేంద్రం నియంతృత్వ విధానాలు అవలంబిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఏక తాటి పైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.  బిజెపీకి వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన పార్టీలతో  కల్సి  పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని మమతా బెనర్జి లేఖలో స్పష్టం చేశారు.

గతంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు మమతా బెనర్జి ప్రయత్నాలు చేసినా  అవి అర్దాంతరంగా నిలిచి పోయాయి. అనేక రాష్ట్రాలలో కాంగ్రేస్ పార్టీతో సహా ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. బీజేపి ఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అసలు పట్టించు కోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  ఆంధ్ర  ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెర వేర్చ లేదు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరంతరాయంగా  పోరాటం కొనసాగిస్తున్నా కుట్రలతో పోరాటాన్ని అణిచి వేసే యత్నాలు సాగిస్తోంది.  ప్రైవేటీకరణ తో కార్పోరేట్ శక్తులను పెంచి పోషిస్తు దేశ ప్రయోజనాలను  దెబ్బ తీస్తున్న  బిజెపీ కి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు ఇదే తగని సమయమని మమతా  బావిస్తున్నారు. అయితే బీజెపీకి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు కల్సి వస్తాయో చూడాలి. సమస్యలు అనేకం ఉన్నా కేంద్రంలో అధికార బిజెపీ పై నేరుగా పోరాడేందుకు కొన్ని పార్టీల నేతలు సిద్దంగా లేరు. అవసరాల కనుగుణంగా ప్రాంతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు