సాగర్ లో ఆదిలోనే బెడిసిన కాశాయ వ్యూహం

 సాగర్ బరిలో బిజెపికి షాక్ - కారెక్కనున్న కాశాయ నేతలు


సాగర్ ఉప ఎన్నికల్లో ఎత్తులు పై ఎత్తులు వేయాలన్న  భారతీయ జనతా పార్టి వ్యూహం బెడిసింది. అధికార పార్టి అభ్యర్థి  ఖరారు అయిన తర్వాత బలాబలాలు బేరీజు వేసి ధీటైన తమ పార్టి అభ్యర్థిని ఖరారు చేయాలని బిజెపి భావించింది. వ్యూహం బాగానే ఉన్నా తీరా అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత అసంతృప్తి నేతలను బుజ్జగించ లేక పోయింది. బిజెపి అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ పేరు అధికారికంగా ప్రకటించి బి ఫాం ఇచ్చిన తర్వాత అసంతృప్తి దారులు మండిపడ్డారు. ప్రధానంగా 2018 ఎన్నికల్లోపార్టి అభ్యర్థిగా పోటి చేసిన మహిళా అభ్యర్థిని నివేదితా రెడ్డి ముందుగానే పార్టి టెకెట్ ఆశించి నామినేషన్ కుడ వేశారు. అట్లాగే యాదవ కులానికి చెందిన కడారి అంజయ్య కూడ బిజెపి టికెట్ ఆశించాడు. ఈ ఇద్దరిని కాదని బిజెపి అధిష్టానం డాక్టర్ రవికుమార్ ను ఎంపిక చేసింది. దాంతో టికెట్ రాక భంగ పడ్డ బిజెపి నేతలను గులాబి నేతలు ఆహ్వానించారు. ఉప ఎన్నికల సమయంలో  అసంతృప్తి నేతలను పార్టీలో చేర్చుకుని  బిజెపీని నైతికంగా ఇర కాటంలోపెట్టాలన్న ఉద్దేశంతో అసంతృప్తి నేతల భవిష్యత్ కు భరోసా ఇచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు ప్రారంబించారు. టిఆర్ఎస్ పార్టి ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి, పైలా శేఖర్ రెడ్డి తదితరులు కడారి అంజయ్యను వెంటబెట్టుకుని సిఎం కెసిఆర్ వద్దకు తీసుకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. 

బిజెపీకి ఆది లోనే అసంతృప్తి నేతల జంపింగ్ సమస్యగా మారి మైనస్ పాయింటే కాగలదు. 

టిఆర్ఎఅస్ పార్టీలో కూడ అసంతృప్తి నేతలు ఉన్నారు. ఉప ఎ్ననికల్లో పలువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు టికెట్లు ఆశించగా కెసిఆర్ చివరికి నోముల నర్సింహయ్య తనయుడు భరత్ ను  ఎంపిక చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వారసులకు టికెట్లు ఇవ్వడం టిఆర్ఎస్ పార్టి అధి నుండి ఆనవాయితీగా కొనసాగిస్తు వస్తోంది. దుబ్బాకలో రామలింగా రెడ్డి సతీమనికి టికెట్ ఇచ్చింది. అయితే ఓడి పోవడంతో సాగర్ లో వారసులకు కాకుండా ఇతరులకు టెకెట్లు ఇస్తారని ఆశించారు కాని కెసిఆర్ అందుకు అంగీకరించ లేదని సమాచారం. పైగా సాగర్ లో పరిస్థితులు టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని సర్వేల ఫలితాలు కూడ అనుకూలంగా వచ్చాయని కెసిఆర్ నోముల తనయుడు భర్త కు అవకాశం ఇచ్చారు.  అంతే కాకుండా పార్టీలో టికెట్లు ఆశించిన వారిని  కెసిఆర్ స్వయంగా నచ్చచెప్పి బుజ్జగించారని సమాాచారం.

ముగిసిన నామినేషన్లు

సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలు  మంగళవారంతో ముగిసాయి. ఈ నెల 31న నామినేషన్లు పరిశీలించ నున్నారు.  ఏప్రిల్‌ 3 నామినేషన్లు  ఉపసంహరణకు చివరి గడువు.   ఏప్రిల్‌ 17న పోలింగ్ జరగనుంది. ఫలితాలు  మే 2న వెల్లడి కానున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు