సిబిఐ విచారణకు బిజెపీ డిమాండ్

 ప్రధాన ఎన్నికల అధకారి శశాంక్ గోయేల్ ను కల్సి ఫిర్యాదు చేసిన బిజెపి అభ్యర్థి రాంచందర్ రావు


ఎమ్మెల్సి ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపిస్తు సిబిఐ విచారణ జరిపించాలని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సి స్థానం నుండి  పోటి చేసిన భారతీయ జనతా పార్టి అభ్యర్థి రాంచందర్ రావు డిమాండ్ చేసారు. 

సోమవారం ఆయన ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ను కల్సి ఈ మేరకు ఫిర్యాదు చేసారు. పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల్లో రెండు స్థానాల్లోను అధికార టిఆర్ఎస్ పార్టీ చేతిలో  భారతీయ జనతా పార్టి అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి,హైదరాబాద్ ఎమ్మెల్సి బిజెపి సిట్టింగ్ స్థానం. ఇక్కడి నుండి రెండు విడతలుగా పార్టి అభ్యర్థి రాంచందర్ రావు గెలిచారు. సిట్టింగ్ స్థానంలో సునాయాసంగా గెలుస్తామని బిజెపి ఆశించింది కాని సిట్టింగ్ స్థానంకోల్పోయింది. రాంచందర్ రావు మూడో సారి గెలిచి హాట్రిక్ సాధిస్తారని అందరూ భావించారు. అయితే ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వెలువడడం పార్టి జీర్ణించు కోలేక పోతోంది.

అధికార పార్టి ఎన్నికలకోడ్ ఉల్లంఘనకు పాల్పడిందని ప్రభుత్వ ఉద్యోగుల కిచ్చే  పిఆర్ ఎస్  ఫిట్ మెంట్ విషయంలో ప్రలోభాలకు గురి చేశారని కావాలనే సిఫార్సుల కన్నా ఎక్కువగా ఫిట్ మెంట్ ఇస్తామని   ముందే లీకులిచ్చారని రాంచందర్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో కోట్ల  రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. డిజిటల్ విధానంలో గూగుల్, పేటిఎం యాపుల ద్వారా డబ్బుల బదిలి జరిగిందని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశానని రాంచందర్ రావు మీడియాకు తెలిపారు. ఓట్రల నమోదులో కూడ అధికార పార్టి అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. బోగస్ యూనివర్శీటీల డిగ్రీ సర్టిఫికేట్లతో నకిలి డిగ్రి సర్టిఫికేట్లతో ఓటర్ల నమోదు జరిగిందని ఆరోపించారు. అధికార టిఆర్ఎస్ పార్టి కోడ్ ఉల్లంఘనపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రదాన ఎన్నికల అధికారిని కోరామని ఆయన తెలిపారు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సి స్థానంపై బిజెపీకి మొదటి నుండి ఆశలు అంతగా లేక పోయినా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానంలో సిట్టింగ్ స్తానం దక్కించు కుంటామన్న ధీమా ఉండేది. కాని ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి గెలవడం బిజెపీ ఊహించని పరిణామం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు