జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సి

 


కేంద్రం 67 వ జాతీయ చలన చిత్ర అవార్డులు సోమవారం ప్రకటించింది. సహజ నటుడు  నాని హీరోగా నటించిన జెర్సి తెలుగు చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారానికి ఎంపికైంది. అట్లాగే మహేశ్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఎంపికైంది.   ఉత్తమ ఎడిటర్ అవార్డు జెర్సి చిత్ర ఎడిటర్  నవీన్ నూలి కి దక్కింది. కొరియో గ్రఫి విభాగంలో  మహర్షి చిత్రం కొరియో గ్రాఫర్ రాజుసుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు చిత్ర సీమ నిర్మాణ సంస్థల్లో  దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఎంపికైంది.  ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌‌గా జల్లికట్టు (మలయాళం) పురస్కారాన్ని దక్కించుకుంది. ఉత్తమ నటి పురస్కారాన్ని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (మణికర్ణిక, పంగా) దక్కించుకోగా.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు మనోజ్ భాజ్‌పాయ్ (భోస్లే), ధనుష్ (తమిళం) సంయుక్తంగా ఎంపికయ్యారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు