మంత్రి ఈటెల అక్రమాస్తులపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రేస్ నేత

 


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై హుజూరాబాద్  కాంగ్రేస్ పార్జి ఇన్ చార్జి తీవ్ర ఆరోపణలు చేసారు. మంత్రి ఈటెల అక్రమాస్తులు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో దొడ్డుబియ్యం తిని హాస్టల్ లో ఉండేవాడిని, నేను దొర బిడ్డను కాదు, నాకు గడీలు లేవు, నేను బీసీ బిడ్డను, నా మెడలో బంగారు గొలుసులు, చేతికి ఉంగరాలు లేవు అని మాట్లాడిన ఈటల రాజేందర్ నేడు వీణవంక లో మాట్లాడుతూ నేను ఒక ఎకరం అమ్మితే ఒక ఎలెక్షన్ ఖర్చు అయితది చాలా మందికి తెలియదు ఏమో నాకు రెండు వందల ఎకరాల భూమి ఉన్నది అని చెప్పినారు ఎన్నికల ముందు  భూములు లేవు జాగాలు లేవు అని చెప్పిన నీకు దొడ్డు బియ్యం తిని బతికి నా అని చెప్పిన నీకు ఎలక్షన్స్ తర్వాత రెండు వందల ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.  వీణవంక లో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదరికం పోదని చెప్పినారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశ పెట్టినప్పుడు ఇవి చాలా గొప్ప పథకాలని అందరికీ ఉపయోగపడతాయని ఎన్నో ప్రగల్బాలు పలికారు అప్పుడు ఈ పథకాలు పేదరికాన్ని పోగొట్ట వని తమరికి తెలియదా అప్పుడు తమరు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు కదా అప్పుడు ఏం చేసినారు అంటే మీకు మీ రాష్ట్ర నాయకుల తోటి మీ ప్రభుత్వం తోటి విభేదాలు వచ్చినప్పుడు మాత్రమే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు గుర్తుకు వస్తారా అంటూ ప్రశ్నించారు. 

గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు హుజురాబాద్ గడ్డ మీద ఈటెల రాజేందర్ గారు మీరు సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉండి ఎన్ని స్కాములు చేసినారో అవన్నీ ఆధారాలతో సహా బయట పెడతా అని సవాలు విసిరిన మా నాయకులు రేవంత్ రెడ్డి గారు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారని  దమ్ముంటే ఆ సవాలును స్వీకరించి చర్చకు రావాలని కౌశిక్ రెడ్డి సవాల్ చేసారు.

 జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లు పి. సత్యనారాయణ రావు, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఎస్ సి సెల్ అధ్యక్షులు ఉప్పరి రవి, జిల్లా కాంగ్రెస్ ఎస్ టి సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, నాయకులు గుండా టి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కుర్ర పోచయ్య తదితరులు

 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి మంత్రి ఈటెల రాజేందర్ పై పోటి చేసి ఓడి పోయారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు