బాణం ముందొచ్చింది-వెనక జగనొస్తడు-అటెంక బాబొస్తడు - మంత్రి గంగుల కమలాకర్

 


వై.ఎస్.షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో గులాబి నేతలు విమర్శల దాడి పెంచారు.  మతం ప్రాతి పదికన కొత్త పార్టీలు వస్తున్నాయని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి ఈటెల రాజేందర్ షర్మిల పార్టీని ఉద్దేశించి ఇటీవల హెచ్చరించగా గంగుల కమలాకర్ కూడ షర్మిల పార్టి విషయంలో ఆసక్తికర విమర్శలు చేశారు.

పార్టి సభ్యత్వ నమోదు కోసం మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్  మీడియాతో మాట్లాడుతు జగనన్న బాణం షర్మిల ముందు వచ్చిందని తర్వాత మెల్లగా జగన్ వస్తాడని ఆతర్వాత  చంద్రబాబు కూడ వస్తాడని అన్నారు. వై.ఎస్.షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే పేరిట హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కాంపు వేసి రోజుకో జిల్లా నేతలతో సంప్రదింపులు జరుపుతోంది.  జిల్లాల పర్యటన జరపాలని ఆమె నిర్ణయించగా అందుకు ఎమ్మెల్సి ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో వాయిదా వేసుకుంది. షర్మిల రాజకీయ పార్టీ విషయంలో ఎవరూ మాట్లాడవద్దని నిర్ణయించుకున్నా ఏదో ఓ సందర్భంలో గులాబి నేతలకు స్పందించక తప్పడంలేదు. షర్మిల పార్టి తో తెలంగాణ లో మళ్లి కొట్లాటలు తప్పవని అన్నారు. కేసీఆరే తెలంగాణ రక్షకుడని కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని లేకపోతే సమైక్య రాష్ట్రం అవుతుందని హెచ్చరించారు. సమైక్య రాష్ట్రం వస్తే తిరిగి ఆంధ్ర నేతలు  ఆంధ్రా నేతలు కరెంటు, నీళ్లు ఎత్తుకపోతారని గంగుల విమర్శించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు