కోటి వృక్షార్చణలో మేము సైతం అంటూ మొక్కలు నాటిన జర్నలిస్టులు

 కోటి వృక్షార్చణలో... కలం సైనికులు
మొక్కలు నాటి ఘనంగా సిఎం కెసిఅర్ జన్మ దిన వేడుకలు
రాష్ట్ర వ్యాప్తంగా భాగస్వాములైన
 టియుడబ్ల్యు-టిజేఎఫ్ జర్నలిస్టులు


సీఎం కెసిఆర్  జన్మ దినాన్ని పురస్కరించుకుని,  హరితహారం స్ఫూర్తి తో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కొనసాగిస్తున్న, గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో భాగంగా చేపట్టిన, "కోటి వృక్షార్చన"లో తెలంగాణ జర్నలిస్టులు  భాగస్వాములు అయ్యారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్  ఆవరణ లో జరిగిన కోటి వృక్షార్పరణ కార్యక్రమం తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా.. వరంగల్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీఎం కెసిఆర్  పౌర సంభందాల అధికారి రమేశ్ హజారి,  టియుడబ్ల్యు-టిజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్..తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్ులు ఇస్మాయిల్  కార్యదర్శి  రమణ కుమార్ తదితరులు మొక్కలు నాటారు.

సిఎం కెసిఆర్ వల్లే  2 వేలమంది జర్నలిస్టులకు మూడున్నర కోట్ల ఆర్థిక సహాయం

ఈ సందర్భంగా జరిగిన మీడియా  అల్లం నారాయణ  మాట్లాడుతూ.. తెలంగాణలో 2వేల మంది జర్నలిస్టులు కొవిడ్ బారిన పడితే మూడున్నర కోట్లు ఆర్థిక సహాయంగా అందించామని తెలిపారు.  ఇదంతా  సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. జర్నలిస్టుల ఇండ్ల  స్థలాల పంపిణీ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉండటం వల్ల ఇళ్ల స్థలాల పంపిణీ ఆలస్యం అవుతోందన్నారు. సుప్రీం కోర్టుకు సంబంధం లేకుండా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులు నిరుత్సాహ పడవద్దని అల్లం నారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, టెంజు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఇస్మాయిల్, రమణ, సీఎం పీఆర్ఓ రమేష్ హజారే,  రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్. లెనిన్, డెస్క్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ శంకేశి శంకర్రావు, రాష్ట్ర నాయకులు పిన్న శివకుమార్, తడుక రాజనారాయణ, మస్కపురి సుధాకర్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, పెరుమాండ్ల వెంకంటేశ్వర్లు, అర్బన్ జిల్లా కార్యదర్శి సుభాష్, టెంజు అధ్యక్ష, కార్యదర్శులు పొగకుల అశోక్, రాజ్ కుమార్ రూరల్ జిల్లా అధ్యక్ద్, కార్యదర్దులు మెండు రవీందర్, ఉమెందర్ తదితరులు పాల్గొన్నారు.


.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు