కోటి వృక్షార్చనతో సిఎం కెసిఆర్ వినూతనంగా 68 వ పుట్టిన రోజు వేడుకలు

 రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న గులాబి నేతలు
స్వయంగా రుద్రాక్ష మొక్క నాటిన కెసిఆర్


సిఎం కెసిఆర్ 68 వ పుట్టిన రోజు సందర్బంగా బుధవారం రాష్ర్ట వ్యాప్తంగా వినూతన రీతిలో  కోటి వృక్షార్చనతో  వేడుకలు నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ విన్నపం మేరకు సిఎం కెసిఆర్ స్వయంగా తన పుట్టిన రోజును పురస్కరించి రుద్రాక్ష మొక్కను నాటారు. 

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయ వంతం చేసారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా తాను పల్లె నిద్ర చేసిన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు హనుమాన్ తండాలోగ్రామస్తులతో కలిసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కులు నాటారు. ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాయపర్తి, మామునూరు లో కూడ మంత్రి మొక్కలు నాటారు.

హనుమాన్ తండాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లెనిద్ర చేసి గ్రామస్థుల సమస్యలు అడిగి తెల్సుకున్నారు. గుగులోత్ జగన్ ఇంటిలో బస చేసిన మంత్రి కి తండా వాసులు స్వాగతం పలికి సంప్రదాయ జొన్న రొట్టెలు, ఆకు కూరలతో అన్నం వడ్డించారు. గ్రామస్థులతో కల్సి మంత్రి భోజనం చేసి అక్కడే నిద్ర చేసి తెల్లవారి మొక్కలు నాటే కార్యక్రమంలోపాల్గొన్నారు.




టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో జరిగిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.  ఎమ్మెల్సీ క‌విత‌, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌కు బంగారు చీరను స‌మ‌ర్పించారు. దాత‌ల స‌హ‌కారంతో రెండున్న‌ర కిలోల బంగారంతో ఈ చీర‌ను తయారు చేయించి నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ బాల్యం, విద్య, రాజకీయ ప్రస్తానం, తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమం నేపధ్యాన్ని వివరించేలా త్రీ డీ గ్రాఫిక్స్ లో బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో రూపొందించిన 30 నిమిషాల వ్యవధి కలిగిన డాక్యుమెంటరీ విడుదల చేసారు. 

ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి  మల్లారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, MP రంజిత్ రెడ్డి లు కట్ చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎ్మమెల్సీలు  తదితరులు 67 కిలోల భారి కేక్ ను కట్ చేసారు.





 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు