జడ్జికి ఐ లవ్ యూ చెప్పి ఛీ వాట్లు తిన్న నిందితుడు


నేరం చేసి పోలీసులకు పట్టుబడిన నిందితుడు కేసు విచారణ సందర్భంగా ఏకంగా తీర్పు చదువుతున్న మహిళా జడ్జికి ఐ లవ్ యూ చెప్పి ఛీ వాట్లు తిన్నాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన డెమెట్రియస్ లేవీస్ అనే పాతనేరస్తున్ని పోలీసులు దొంగతనం కేసులో అరెస్టు చేసారు. చార్జి షీటు వేయడంతో ఆన్ లైన్ ద్వారా కేసు విచారణ జరిగి తీర్పు చెప్పే సమయంలో మహిళా జడ్జి తబితా బ్లాక్ మోన్ అటెన్షన్ డైవెర్ట్ చేస్తూ ఆమెను మాటల్లోకి దించి లవ్ ప్రపోజ్ చేశాడు. కావాలనే చేశాడోమ ఇంప్రెస్ గా మాట్లాడితే శిక్ష తప్పుతుందని భావించాడో కాని జడ్జి చేత ఛీ వాట్లు తిన్నాడు. మీరు చాలా అందంగా ఉన్నారు.. ఈ మాట మీతో చెప్పాలి.. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ.. అంటూ చెప్పాడు. అతని మాటలకు చిన్నగా నవ్విన జడ్జి తబితా ఆ తర్వాత గట్టిగానే ఛీ వాట్లు పెట్టారు.  నేరం చేసినందుకు  శిక్ష తప్పలేదు. తనను పొగిడి నందుకు థ్యాంక్స్ చెప్తూనే ఈ వెర్రి వేషాలు తన వద్ద కుదరవని చెప్పారు. పొగడ్తలు నీకు ఎక్కడైనా ఉప యోగపడుతా యేమో గానీ ఇక్కడ మాత్రం పనిచేయవు అని ఛీ వాట్లు పెట్టారు. లేవీస్ కు దిమ్మ తిరిగేలా 5వేల డాలర్ల జరిమానా విధించారు. 

లూయూస్ గతంలో పలు నేరాల కింద కోర్టు శిక్ష పడగా నాలుగు సంవత్సరాల పాటు జైళు లో గడిపి  2019 లో జైలు నుండి విడుదలై తిరిగి నేరాలకు పాల్పడ్డాడు. ఈ వీడియో ఎట్లా బయటికి వచ్చిందో కాని ప్రపంచ వ్యాప్తంగా బాగా వైరల్ అయింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు