కిడ్నాప్ డ్రామా ఆడిన బి ఫార్మసి విద్యార్థిని ఆత్మహత్య


 కిడ్నాప్ అయ్యాయని పోలీసులను కుటుంబ సభ్యులను నమ్మించాలని చూసిన బీఫార్మసీ విద్యార్థిని అర్దాంతరంగ తనువు చాలించింది. కొద్ది రోజులుగా తన అమ్మమ్మ ఇంట్లో షుగర్ కోసం వాడే టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది.

డ్రామా ఆడి హైదరాబాద్ లో కలకలం రేపిన బీఫార్మసీ కథ విషాదాంతంగా మారింది. కాలేజీకి వెళ్లి తిరిగొస్తుండగా కిడ్నాప్ అయ్యానంటూ తల్లికి ఫోన్ చేసింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గాలించారు. గాలించి విద్యార్థినిని పట్టుకోగ అంత అబద్దమని తేలింది. స్నేహితుడితో తిరిగి ఆలస్యం కావడంతో కిడ్నాప్ డ్రామా ఆడి ముప్పతిప్పలు పెట్టిన యువతి చివరకు దారుణ నిర్ణయం తీసుకుంది. కిడ్నాప్ డ్రామా అంతా ఫేక్ అని పోలీసులు తేల్చడంతో ఇంటా బయటా తీవ్ర విమర్శలువచ్చాయి. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయినట్టు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత ఆ యువతి తన అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటోంది. ఈ పది రోజులుగా కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయింది. తీవ్ర మనస్తాపంతో మంగళవారం రాత్రి ఇంట్లో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గుర్తించి ఆమెను కుటుంబ సభ్యులు ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు