పాస్ పోర్టా మజాకా- అదెంత పని-డబ్బులిస్తే "సై" లేకుంటే "నై"

  అక్రమార్కుల కు పోలీసు శాఖ అండదండలు
డబ్బులు లేకుండా విచారణ పూర్తి కాదు
ఫిర్యాదు చేస్తే ఏవో కొర్రీలు పెడతారని భయం
వేయి - రెండు వేలు ఇస్తే తప్ప రిపోర్ట్ రాయరు

హైదరాబాద్ లో అయితే కనీసం 5 వేలు 


పాస్ పోర్టుల  జారి కోసం అవసరమయ్యే పోలీస్ క్లియరెన్సు కోసం జరిగే విచారణల వ్యవహారం లో మార్పులు రావడం లేదు. డబ్బులు ఇవ్వందే విచారణలు జరపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అన్ని అర్హతలు ఉన్న సరైన ధృ పత్రాలు ఉన్నా విచారణ కు కనీసం 2 వేల వరకు సమర్పించాల్సిందే. డబ్బులు ఇవ్వని వారికి కొర్రీలు పెట్టి అడ్రస్ లో లేరని లేదా లోకల్ లో ఉండకుండా హైదరాబద్ లో ఉంటున్నారని అక్కడి పోలీసులకు విచారణ కోసం  రాస్తామంటూ కొర్రీలు వేసి రిపోర్టులు తిప్పి పంపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

అయితే అసలైన వారికి పాస్ పోర్టులు పొందాలంటే ఇలా సవాలక్ష సమస్యలు కాని అక్రమార్కులకు, రోహింగ్యాలకు అవేవి అవసరం లేదు.  వారికి పాస్ పోర్టులు పూలల్లో పెట్టి అంద చేస్తున్నారు.  తప్పుడు ధృవ పత్రాలతో పాస్ పోర్టులు పొంది మన దేశంలోకి ఇక్రమంగా చొరబడిన రోహింగ్యాలు  రాచ మార్గంలో  విదేశాలకు చెక్కేస్తున్నారు.

హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే ఇక విచారణ జరిపే పోలీసుల డిమాండ్ మామూలు గా లేదు. కనీసం 5 వేల వరకు ఇస్తే తప్ప పాస్ పోర్టుల విచారణ పూర్తి కాదు.

జిల్లాలు, గ్రామాలలో అయితే విచారణ సులభంగా ఉంటుందని చుట్టు పక్కల తెల్సిన వారి రెఫరన్సు సులభం అవుతుందని తమ స్వంత ఊర్ల చిరునామాలు ఇస్తుంటారు.  పోలీసులు కొర్రీలు వేసేందుకు అనేక రీజన్స్ ఉంటాయి. దాంతో భయపడి పోయి డబ్బులు ఇవ్వకుంటే రిపోర్టు రాయరని డబ్బులు ఇచ్చి రిపోర్టులు రాయించుకుంటున్నారు. 

పాస్ పోర్టుకు దరఖాస్తు చేసిన వారిపై పోలీసు కేసులు ఉన్నాయా లేదా పరిశీలించాలి.  పోలీసు శాఖలో  ఆన్ లైన్ లో కేసుల డేటా అందుబాటులో ఉంటుంది కనుక ఇది సమస్య కాదు. హైదరాబాద్ లో ఉండే పోలీసులు కూడ ఇతర ప్రాంతాల్లో ఉండే వారి కేసుల వివరాలు ఆన్ లైన్ లో తెల్సుకోవచ్చు.  పాస్ పోర్టుకు దరఖాస్తు చేసిన వారు  స్థానికులా లేక స్థానికేతరులా  ఎవరు అన్నది వారి దగ్గర లభించే  ధృవీకరణ పత్రాలతో పాటు లోకల్ రెఫరెన్సులు కూడ విచారించాలి.  

నకిలి ధృవ పత్రాలు ఎక్కువగా నేరస్తులు, నాన్ లోకల్ వాసులు సృష్టించి పాస్ పోర్టులు సంపాదిస్తుంటారు. ఇందు కోసం డబ్బు లిస్తే చాలు పాస్ బ్రోకర్లు అన్ని పనులు చేసి పెడుతుంటారు. 

ఇటీవల నిజామాబాద్ జిల్లా భోదన్ లో వెలుగు చూసిన పాస్ పోర్టు స్కాం వ్యవహారం మొత్తం పాస్ పోర్టు బ్రోకర్ల వల్లే జరిగింది. ఒకే ఇంటి అడ్రస్ పై 37పాస్ పోర్టులు జారి అయ్యాయి.  ఇవన్ని బంగ్లాదేశ్ నుండి మన దేశంలోకి చొరబడి వచ్చి భోదన్ లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలవి కావడం గమనార్హం.  పోలీసుల విచారణ సందర్భంగా నైనా ఈ విషయం కనుక్కో లేక పోయారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పాస్ పోర్టుల విషయంలో అనుమానాలు వేసి పోలీసులకు సమాచారం ఇస్తే గాని ఈ స్కాం వెలుగు చూడ లేదు. ఇందులో 8 మందిని అరెస్టు చేసారు. 

స్పెషల్ బ్రాంచి  ఎస్సై మల్లేశ్‌ రావు, ఏఎస్సై అనిల్‌ కుమార్‌ తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసారు. బోదన్ లో మొత్తం 72 పాస్ పోర్టులు తప్పుడు ధృవ పత్రాలతో తీసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఎప్పటి నుండి ఈ తతంగం జరుగుతుందో సమగ్ర విచారణలో  బయట పడుతుంది. 

పోలీసు శాఖను షేక్ చేసిన ఈ పాస్ పార్ట్ స్కాం వ్యవహారం లో ఇంకా విచారణ కొనసాగు తోంది. తప్పుడు ధృవ పత్రాలతో  చాలా మంది విదేశాలకు వెళ్లారు. ప్రధానంగా బంగ్లాదేశ్ నుండి మన దేశంలోకి చొరబడి దేశంలో వివిద ప్రాంతాల్లో స్థిరపడి పోయిన రోహింగ్యాలు కొద్ది కాలం స్థానికంగా నివాసం ఉండి ఓటరు కార్డులు, అధార్ కార్డులు, రేషన్ కార్డులు పొంది పాస్ పోర్టులు తీసుకుని మన దేశ పౌరులుగా ఆధారాలు చూపి  విదేశాలకు వెళుతున్నారు. ఈ తతంగం హైదరాబాద్ లో కూడ జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. బయటి జిల్లాలలో కూడ జరిగినట్లు భోదన్ స్కాం వల్ల వెలుగు చూసింది. ఇందులో మన నేతల పాత్ర కూడ ఉంది. ఓట్ల కక్కుర్తిలో పడి పోయి ఎవరేమిటో చూడకుండా వారికి అన్ని సమకూరుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

రోహింగ్యాలను గుర్తించడం చాలా కష్టం వారి వేష భాషలన్ని ముస్లీం ల లెక్కనే ఉంటాయి. వారిని చూసి సాధారణ ముస్లిం లని అందరూ నమ్ముతుంటారు. కాని పూర్తి వివరాల లోకి వెళితే తప్ప వారి మూలాలు బయట పడవు. 




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు