వాట్సాప్ కు యూజర్ల షాక్ - సిగ్నల్, టెలిగ్రాం యాప్స్ వైపు చూపు

 


వాట్సాప్ యాప్ వ్యక్తిగత గోప్యత విధానం పై ఆందోళనతో ఉన్న యూజర్లు ఇతర ప్రత్యామ్నాయ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. వాట్పాప్ కొత్త ప్రైవేసి పాలసి విషయంలో యూజర్లకు అనేక అనుమానాలు ఉన్నాయి.  వాట్సాప్ ఈ విషయంలో యూజర్ల అనుమానాలు నివృత్తి చేస్తూ వివరణ ఇచ్చినా  యూజర్లు నమ్మడం లేదు. చాలా వేగంగా గూగుల్ ప్లే స్టోర్ నుండి వాట్సాప్ కు బదులుగా సిగ్నల్, టెలిగ్రాం యాప్ లను డౌన్ లోడ్ చేస్తున్నారు. సిగ్నల్ యాప్ ను జనవరి రెండో వారంలో 12 వతేది వరకు గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుండి 17.8 మిలియన్ల మంది డౌన్ లోడు చేసుకున్నారని మొబైల్‌ యాప్‌ అనలిటిక్స్‌ సంస్థ సెన్సర్‌ టవర్‌ పేర్కొంది. అంతకు ముందు వారంలోని 2,85,000 డౌన్‌ లోడ్లతో పోలిస్తే ఇది 61% పెరుగుదల కావడం గమనార్హం. 

డౌన్ లోడ్లలో సిగ్నల్ యాపు మొదటి ప్రియార్టీలో ఉండగా రెండో ప్రియార్టీలో టెలిగ్రాం యాప్ ఉంది. జనవరి 5 నుంచి 12 మధ్య 15.7 మిలియన్ల డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. అంతకుముందు వారం 7.7 మిలియన్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం.  వాట్సాప్‌కు అంతకు ముందువారం 12.7 మిలియన్ల డౌన్‌లోడ్లు ఉండగా జనవరి 5-12 మధ్య 10.6 మిలియన్లకు తగ్గాయి.   సోషల్‌ మీడియా వినియోగదారులు వాట్సాఫ్ తో పాటు ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు షాక్ ఇచ్చేందుకు  ప్రత్యామ్నాయాలు వెతుకుతుండడంతో వాట్సాప్ ఇప్పటికే ఆందోళన చెందుతోంది.  దాంతో యూజర్లకు ఎట్లాగైనా నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో మెయిన్ స్ట్రీమ్, సోల్ మీడియా వేదికలను వినియోగించి ప్రకటనలు చేసింది. వదంతులు నమ్మవద్దని ఎప్పటిలాగే వినియోగదారుల సందేశాలు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్క్రిప్షన్‌తో భద్రంగా ఉంటాయని ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చింది.

కేంద్రం దృష్టిసారించిందా ?

వినియోగదారుల ఆగ్రహానికి కారణమవుతున్న వాట్సాప్ ప్రైవసీ నిబంధనల మార్పుపై కేంద్రం తాజాగా దృష్టి సారించినట్టు తెలుస్తొంది. ఈ విషయమై అన్ని వివరాలను సేకరిస్తున్నాం. అని ప్రభుత్వాధికారు ఒకరు వ్యాఖ్యానించారు. సమాచార భద్రతకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి చట్టమూ లేని కారణంగానే ప్రభుత్వ వాట్సాప్ ప్రవైసీ నిబంధనల మార్పుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు వార్తలు వచ్చాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు