అదిరిందయ్యా వకీల్ సాబ్

 


వకీల్ సాబ్ టీజర్ పవన్ కళ్యాన్ అభిమానులను సీటీలు కొట్టేలా చేసింది. గురువారం విడుదలైన టీజర్ లో వకీల్ సాబ్ పవర్ ఉన్న వకీలే నని తేలి పోయిందని అభిమానాలు తెగ ఆనంద పడి పోతున్నారు.

లాయర్స్ వేసుకునే కోటుని పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ వేసుకోవడంతో మొదలైన టీజర్‌.. ఆయన లా పుస్తకాలను మూసి ఉంచిన కవర్‌ను తొలగించడం, సీరియస్‌గా కోర్టులో అబ్జక్షన్ యువరానర్ అంటూ డైలాగ్ చెప్పడం.. అలాగే తనని కత్తితో పొడవడానికి వచ్చిన విలన్స్‌తో కోర్టులో వాదించడం తెలుసు... కోటు తీసి కొట్టడమూ తెలుసు అంటూ వారిని చితకబాదడం.. వంటి మాస్ సన్నివేశాలతో పాటు.. చివరలో తన లగేజీతో ట్రావెల్ చేస్తుంటారు.

 పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం వకీల్ సాబ్‌  ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

బ్యాగ్రౌండ్ లో సత్యమే జయతే.. అనే పదానికి సంబంధించిన మ్యూజిక్ వినిపిస్తుంది. టీజర్ పక్కా మాస్‌ను, పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. తమన్ తనదైన స్టైల్లో సూపర్బ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజర్‌లోని ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేశాడు. ఇక సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అనిపించేలా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడక్షన్ డిజైన్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి, డైలాగ్స్‌: తిరు, యాక్షన్ రవివర్మ, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధర్‌, కో ప్రొడ్యూసర్‌: హర్షిత్ రెడ్డి, సమర్పణ: బోనీ కపూర్‌, నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్ , దర్శకత్వం: శ్రీరామ్ వేణు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు