సొంత పార్టి పెట్టే యోచనలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు


ముఖ్యమంత్రి పై విమర్శలు చేస్తూ ప్రభుత్వ విధానాలను తూర్పార బడుతున్న బిజెపి చీఫ్ బండి సంజయ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ కాబినెట్ పదవుల కోసంఅప్పుడే కొట్లాట షురూ అయిందన్నారు. మంత్రి పదవులు దక్కక పోతే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వంత పార్టి పెట్టే ఆలోచనతో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాడో, ఢిల్లీకి ఎందుకు వెళుతున్నాడో చెప్పడని అన్నారు. కెటిఆర్ ను సిఎం నుచేయడానికి అనారోగ్యాన్ని సాకుగా చూపాలా అని విమర్శించారు. 

ఆలేరు నియోజక వర్గానికి చెందిన టిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టి కార్యకర్తలు పలువురు  హైదరాబాద్ బిజెపి  పార్టి కార్యాలయంలో  బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రగతి భవన్ లో ఉంటూ కూడా కనీసం తన మంత్రు లెవరికి అపాయింట్ మెంట్ ఇవ్వడని, అడిగితే బిజీ అంటారని, కానీ ఏంచేస్తుంటాడో తెలియదని పేర్కొన్నారు. అన్నీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటారని, కొన్నిరోజుల తర్వాత ఆ నిర్ణయాలపై యూటర్న్ తీసుకుంటారని ఆరోపించారు. ఓ వ్యక్తి నాశనం కావాలని బీజేపీ ఎప్పుడూ కోరుకోదని కేసీఆర్ అష్టైశ్వరాలతో ఆరోగ్యంగా ఉండాలనే తాను కోరుకుంటానని, భాష విషయంలో ఆయన తన గురువు అని ఆయన వద్ద తాను భాష నేర్చుకోవాలని ఉందని దెప్పి పొడుపుగా అన్నారు.  

 కేంద్ర ం ఇచ్చిన నిధులు పక్కదారి పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించు కోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు.

వరంగల్ కరీం నగర్ రహదారి కోసం కేంద్రం నిధులు ఇవ్వగా టెండర్లు పిలవకుండానే పనులు చేపట్టారని విమర్శించారు.తెరాస నేతలకు కాంట్రాక్టు పనులు ఇస్తున్నారని కాంట్రాక్టర్లు, అధికారులు సిఎం పేరు చెప్పి దోచుకుంటున్నారని ఆరోపించారు. సిఎంఓ కార్యాలయం కమీషన్ల కోసం పని చేస్తోందా అని బండి సంజయ్ అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరగబోయే  నాగార్జున సాగర్ ఉప ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికల్లో మొన్నటి ఫలితాలే పునరావృతం కాబోతున్నాయని అన్నారు. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు