వకీల్ సాబ్ కోసం ఎదురు చూపులు - 14 న టీజర్


పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రెండేళ్ళ గ్యాప్ అనంతరం సిద్దమవుతున్న వకీల్ సాబ్ పై అభిబమానులు భారి ఆశలు పెట్టుకున్నారు. చిత్రం షూటింగ్ పూర్తి అయి  టీజర్ విడుదల చేసే ముహూర్తం కూడ ఖాయ మైంది. జనవరి 14 కు వకీల్ సాబ్ టీజర్ విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ వర్గాల భోగట్ట. పవన్ కళ్యాన్ సన్ని వేశాలన్ని చిత్రీకరించడం పూర్తి అయి పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో  హిందీలో వచ్చిన  పింక్ సినిమాకు వకీల్ సాబ్ రీ మేక్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శృతి హాస‌న్, నివేదా థామ‌స్, అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వేణు శ్రీరామ్ నటించారు.  పవన్ కళ్యాన్ అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొత్త మూవీకి మూడేళ్ళ గ్యాప్ ఏర్పడింది. కరోనా మహమ్మారి కారణంగా చిత్రం షూటింగ్ నిలిచి పోయి కాలయాపన జరిగింది. హైదరాబాద్, అరకు లో చిత్రం షూటింగ్ చేసారు. పవర్ ఫుల్ ఎమోషనల్ డైలాగులతో వకీల్ సాబ్ అదర గొట్టనున్నాడని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నారు. 

వకీల్ సాబ్ మూవీ వేసవిలో విడుదల అవుతుందని తెలుస్తోంది. అదే సమయంలో  చిరంజీవి నటించిన ఆచార్య కూడ విడుదల కానుంది.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు