ట్రంప్ మద్దతు దారుల ఆందోళన- 15 రోజుల పబ్లిక్ ఎమర్జెన్సి

 ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన ట్రంప్ మూర్ఖపు చేష్టలకు అమాయకులు బలి కావల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటమిని అంగీకరించకుండ ఎన్నికలు రద్దు చేయాలని ట్రంపు తన మద్దతు దారులు రెచ్చగొట్టడంతో వారు ఆందోళనకు దిగారు. 


దాంతో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అదుపు చేయడం కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడ్డ ఓ మహిళతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష పీఠానికి నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ ఘన విజయం సాధించారు. 306 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ట్రంప్ మాత్రం తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కోర్టుల్లో పలుమార్లు పిటీషన్లు దాఖలు చేశారు. అయితే న్యాయస్థానాలు వాటిని కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రోజు బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బైడెన్ ఎన్నికను అడ్డుకోవాలని ట్రంప్.. తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. దీంతో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మద్దతుదారులు వాషింగ్టన్‌కు చేరుకున్నారు. 

కాగా.. ప్రణాళిక ప్రకారం బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ బుధవారం రోజు సమావేశం అయింది. ఈ క్రమంలో బైడెన్‌కు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. ఆందోళనకారులను అదుపు చేయడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులకు ఆందోళనకారుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సదరు మహిళ ప్రాణాలు కోల్పోయింది. 
పరిస్థితులను నియంత్రణలోకి తీసుక వచ్చేందుకు 15 రోజుల పాటు పబ్లిక్ ఎమర్జెన్సీ విధించారు. ఆందోళనకారులను అదుపు చేస్తున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు