రతన్ టాటా ఔదార్యం - వేనోళ్ల పొగుడుతున్న నెటిజన్లు

 


రతన్ టాటా..భారత కార్పోరేట్ ధిగ్గజాల్లో ఒకరు. బడా పారిశ్రామిక వేత్తే అయినప్పటికి మానవతకు పెట్టింది పేరు. ఇతర కార్పోరేట్ ధిగ్గజాలకు ఇతర పారిశ్రామిక వేత్తలతో పోల్చితే రతన్ టాటా కొంచెం భిన్నంగా స్పందిస్తారు.

సింపుల్ సిటి ఆయన ప్రత్యేకత. రతన్ టాటాకు సంభందించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ విషయం కొంచెం ఆలస్యంగా ప్రపంచానికి తెల్సింది. 

తన దగ్గర పనిచేసిన ఓ మాజి ఉద్యోగి ఒకరు గత రెండు సంవత్సరాలుగా ఆనారోగ్యంతో బాదపడుతున్నాడు. అతన్ని పరామర్శించేందుకు 83 సంవత్సరాల  రతన్ టాటా స్వయంగా ముంబై నుండి నేరుగా పూనే లోని  ఆతని ఇంటికి వెళ్ళి ఆశ్చర్య పరిచాడు. అసలు రతన్ టాటా రాక గురించి తెలియని ఆ మాజి ఉద్యోగి ఆనందానికి   అంతు లేదు.  పబ్లి సిటి అంటే రతన్ టాటాకు గిట్టదు కనుక ఈ విషయం మీడియాలో రాలేదు. ఓ ఉద్యోగి ఆలస్యంగా ఈ విషయం తెల్సి లింకెడిన్ లో జనవరి 4 వ తేదీన  పోస్ట్  చేసాడు.

ముంబై నుండి పూనేకు ఎలాంటి హడావుడి లేకుండా బందోబస్తు లేకుండా సెక్యూరిటి కూడ లేకుండా వెళ్ళి యోగ క్షేమాలు అడిగి తెల్సుకోవడం తెల్సిన నెటిజెన్లు రతన్ టాటా మానవీయ ఆవిష్కరణకు జేజేలు పలికారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు