టాప్ 10 లో ఎపి సిఎం ది మూడో స్థానం ఆఖరి వరుసలో తెలంగాణ సిఎం

 లెక్క తప్పింది సారు...

దేశ్ కా మూడ్ పేరిట ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ సర్వే 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల దేశంలో 66 శాతం సంతృప్తి 

అత్యుత్తమ సిఎం గా నవీన్ పట్నాయక్

టాప్ 10 లో మూడో స్థానంలో ఎపిసిఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత టాప్ గేర్ లో దూసుకు వెళ్లిన కారు ప్రస్తుతం రివర్స్ గేర్ లో పడింది.  ఆ విషయం దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో రుజువు అయింది. ఆ కారుతో పాటు సిఎం కెసిఆర్ ఇమేజ్ గ్రాఫ్ కూడ పడిపోయి నట్లే లెక్క . ముఖ్య మంత్రిగా కూడ ఆయన రాంకు పడిపోయిందని తాజాగా దేశ్ కా మూడ్ పేరిట ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ నిర్వహించిన సర్వే వెల్లడించింది.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోం సిఎం కెసిఆర్ జోరుగా కనిిపంచారు. దేశంలో  కొంత మెరుగైన రాంకు పొందారు. కాని రాను రానురాజు గుర్రం గాడిద అయినట్లు పాలన లో వెనుక బడి పోయారు.

ఏబీపీ న్యూస్ - సీ ఓటర్  సర్వే ప్రకారం అయితే కెసిఆర్ రాంకు టాప్ 10 లో కాదు కదా దేశంలో  చివరి స్థానంనుండి నాలుగో స్థానంలో నిలిచారు. ఈ యన కన్నా ఇంకా కింది స్థానాల్లో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అట్టడుగ స్థానంలో  నిలవగా హర్యానా సీఎం ఖట్టర్ చివరి నుంచి రెండో స్థానంలో. పంజాబ్ సీఎం అమరీందర్ చివరి నుండి మూడో స్థానంలో ఉన్నారు. అట్టడుగు నుంచి ఐదో స్థానంలో తమిళనాడు సీఎం పళని స్వామి నిలిచారు.

ఇంతకు మన పొరుగు రష్ట్రం సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రాంకులో ఉన్నారో కూడ ఈ సర్వే స్పష్టం చేసింది. అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్ర స్థానంలో ఉన్నారని సర్వే పేర్కొంది. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రి వాల్ రెండో స్థానంలో నిలవగా ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి టాప్ 10 లో  మూడో స్థానం దక్కింది. బెస్ట్ సిఎంల జాబితాలో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నాలుగో స్థానంలో నిలవగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఉద్దవ్ ధాక్రే ఆదో స్థానంలో నిలిచారు. చత్తీశ్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘల్ ఆరో స్థానంలో నిలవగా పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి 8వ స్థానంలో నిలిచారు.

ప్రధాన మంత్రి స్వంత రాష్ట్రం అయిన గుజరాత్  రాష్ట్ర సిఎం టాప్ 10 లో చివరన నిలిచారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ 9 రాంకు లో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శవిరాజ్ సింగ్ చౌహాన్ 8 వస్థానంలో నిలిచారు.

కరోనా మహమ్మారి కారణంగా దేసం అతలా కుతలం అయిన నేపద్యంలో పాలన పరం  అంశాలు, ముఖ్యమంత్రుల పని తీరు పై తదితర అంశాలపై ఈసర్వే నిర్వహించారు. దేసంలో 543 లోక్ సభ నియోజకవర్గాల పరిదిలో 30 వేల మందిని ప్రశ్నించి ఈ సర్వే జరిపినట్లు సి ఓటర్ వెల్లడించింది. ప్రదాన మంత్రి నరేంద్ర మోది పని తీరు పట్లు దేశంలో 66 సాతం మంది సంతృప్తికరంగా ఉన్నారని సర్వే లో తేలిందని ప్రకటించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు