కరోనా ఎఫెక్టా!.. నిరాసక్తతా ?..కారణాలు ఏంటి?

  • గడప దాటని ఓటర్లు- అంతు చిక్కని ఓటర్ల మనోగతం
  • గత ఎన్నికల లాగే  గ్రేటర్ వాసుల నిరాసక్తత - పోలింగ్ కేంద్రాలకు రాని ఓటర్లు 


గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో ఓటర్లు నిరాసక్తత మరో సారి బయట పడింది. 2016 ఎన్నికలలో జరిగినట్లే ఈ ఎన్నికలలో కూడ ఓటర్లు  ఇండ్ల నుండి బయటికి రాలేదు. పోలింగ్ బూతులకు రాలేదు. 2016 ఎన్నికలలో ఓవరాల్ గా 45.29 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి కూడ అంతకు మించక పోవచ్చని ఇంకా తక్కువే కావచ్చని  సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్ సరళి చూస్తే అర్దం అవుతోంది.   అధికారికంగా ఎన్నికల కమీషన్ పోలింగ్ శాతం ప్రకటించాల్సి ఉంది. 

ఉదయం నుండి పోలింగ్ చాలా మంద కొడిగా సాగింది. కొన్ని పోలింగ్ బూతులలో ఒక్క ఓటరు కూడ రాక పోవడంతో పోలింగ్ సిబ్బంది చేసే పని లేక టేబుళ్లపై తలలు వాల్చి నిద్ర పోయిన దృష్యాలు మీడియాల్లో వచ్చాయి.  నగరంలో పోలింగ్ మంద కొడిగా కొనసాగినా గొడవలు మాత్రం బాగానే జరిగాయి. టిఆర్ఎస్, బిజెపి నేతల మద్య చాలా చోట్ల ఘర్షణలు తలెత్తాయి. కూకట్ పెల్లి, షేక్ పేట నాలా లో కొట్టుకున్నారు. ఎన్నికల కమీషన్ అజాగ్రత్త కారణంగా ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ నిలిపి వేసి రి పోలింగ్ కు ఆదేశాలు జారి చేసారు. బాలెట్ పత్రంలో సిపిఐ అభ్యర్థి ఎన్నికల గుర్తు కంకి కొడవలికి బదులుగా సుత్తె కొడవలి ముద్రించారు. పోలింగ్ జరిగే సమయంలో ఈ తప్పును గుర్తించడంతో పోలింగ్ నిలిపి వేసి తిరిగి రీ పోలింగ్ కు  ఆదేశించారు.

 నగర ఓటర్ల అనాసక్తికి కారణాలు అంతు పట్టడం లేదు. ఓటర్లు విధిగా ఓటు హక్కు విని యోగించుకునేలా చర్యలు చేపడితే తప్ప నగర ఓటర్ల సరళిలో మార్పు రాదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓటర్ల అనాసక్తికి కరోనా ఓ కారణం అనుకుంటే నగరంలో కరోనా ఆంక్షలు త్రోసి రాజని నగర వాసులు సాధారణ రోజుల్లో యధేచ్చగా సంచరించిన సందర్బాలు గుర్తు చేసుకుంటున్నారు. పోలింగ్ రోజు సెలవు దినం కావడంతో బద్దకించి భాద్యత మరిచి  బయటికి  రాలేదా ఆనే చర్చ జరుగుతోంది. మరో వైపు ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు విద్వేష ప్రసంగాలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల ప్రజలు విసుగు చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం కు అలవాటు పడిన రీతిలో ఓట్ ఫ్రం హోం కల్పించాలేమో నని సోషల్ మీడియాలో జోకులు పేల్చారు.

మరో  వైపు తక్కువ పోలింగ్ జరగడంతో రాజకీయ పార్టీలకు గెలుుప ఓటములపై భయం పట్టుకుంది. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు