కెనడా ప్రధానిని కదిలించిన రైతుల ఆందోళన - సంఘీభావం ప్రకటించిన దేశాధి నేత

 


ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన సెగ ఈ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తగిలిందో లేదో కాని కెనడా ప్రధాన మంత్రిని కదిలిచింది. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సద్దులు కట్టుకుని దేశ రాజధాని డిల్లీని ముట్టడించేందుకు బయలు దేరిన రైతులను పోలీసులు నగరంలోకి అడుగు పెట్టకండా సరిహద్దు బయటే నిలిపి వేశారు. రైతులను బెదరగొట్టేందుకు పోలీసులు లాఠి చార్జి చేసి బాష్ప వాయు గోళాలు ప్రయోగించినా వాటర్ కానెన్ లతో జల ప్రయోగం చేసినా రైతులు మొండి కేసి అక్కడే తిష్ట వేశారు. ఓవైపు తీవ్రం రూపం దాల్చిన చలిలో ప్రాణాలు పోతున్నా లెక్కచేయకుండా  రైతులు చూపిన పోరాట పటిమకు దేశావాసులు జేజేలు పలికారు. సోషల్ మీడియాలో రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు.

గురునానక్ 551 జయంతి సందర్భంగా ఒక ఆన్ లైన్ కార్యక్రమంలో కెనడా ప్రధాన మంత్రి ట్రూడో  పంజాబి సంతతి సిక్కులను ఉద్దేశించి  మాట్లాడుతూ రైతుల ఆందోళనా కార్యక్రమాలను ప్రస్తావించి సంఘీభావం తెలిపారు.కెనడా లో ఎక్కువ సంఖ్యలో  పంజాబి సిక్కులు స్థిర పడి పోయారు. 

రైతుల  ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా అందరూ గమనిస్తున్నారు.  అయితే  ఎవరూ ఇంత వరకు నోరు తెరవక పోయినా కెనడా దేశాధి నేత  జస్టిన్ ట్రూడో రైతుల ఆందోళన పై స్పందించడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. రైతుల ప్రతిఘటనపై  ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు తమ సంపుర్ణ మద్దతు ప్రకటించారు. శాంతి యుతంగా సాగే  నిరసనలకు కెనడా మద్దతు ఎల్లప్పుడు  ఉంటుందని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.  అహింసాయుతంగా తమ హక్కుల కోసం పోరాడే వారి పక్షాన కెనడా మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తున్నానని చెప్పారు. నిరసనలో పాల్గొంటున్న రైతుల కోసం వారి కుటుంబ సభ్యులు ఆాందోళనతో ఎదురు చూస్తున్నారని అన్నారు.  చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలని సూచించారు. రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని భారత అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళామని అన్నారు. 

భారత అంతర్గత విషయాలపై స్పందించడం సరైంది కాదు..కేంద్రం

కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు సరికాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి   అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. సరైన సమాచారం లేకుండా కెనడా నేత మాట్లాడారని మరో దేశ అంతర్గత విషయాలపై జోక్యం తగదని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు