ప్రపంచ మహోపాధ్యాయుడు రంజిత్ సిన్హ్ దిసాలే

        వన్ మిలియన్ డాలర్ల ప్రైజ్ మని గెలుచుకున్న దిసాలే


రంజిత్ సిన్హ్ దిసాలే ..ప్రస్తుతం ఈ పేరు ప్రపంచంలో మారుమోగుతోంది. ఆయనో సెలబ్రిటి కాదు..పొలిటీషియన్ అంతకూ కాదు..సైంటిస్టో లేక ఇంజనీరో కాదు..మామూలు సర్కారు బడి ఉపాధ్యాయుడు. మహారాష్ట్ర లోని సోలాపూర్ జిల్లా పరిదే వాడి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు.

ప్రపంచ ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ ప్రైజ్ మని ఆవార్డును గెలుచుకున్నాడు. డిసెంబర్ 3 వ తేదీన లండన్ లో లోని నాచురకల్ హిస్టరి మ్యూజియంలో  వర్క్ పౌండేషన్ అధ్వర్యంలో ప్రపతి  ఏటా నిర్వహించే ప్రపంచ ఉత్తమోత్తమ ఉపాధ్యాయ ఎంపిక కార్యక్రమంలో వన్ మిలియన్ డాలర్లు (7.3 కోట్ల ఇండియన్ కరెన్సి) గెలుచుకున్నారు. 

ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడిగా 32 ఏళ్ల రంజిత్ సిన్హ్ దిసాలే సాధించిన విజయం మామూలు విజయం కాదు. ఈ ప్రైజ్ మని కోసం ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాలకు చెందిన మొత్తం 12 వేల మంది ఉపాధ్యాయులు పోటి పడ్డారు. వేలాది మంది లో దిసాలేతో పాటు ఫైనల్ గా మరో 9 మంది ఎంపికయ్యారు. చివరికి ఆ 10 మంది నుండి దిసాలేను అంతిమ విజేతగా ప్రకటించారు.ఎంతో ఇష్టంతో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టిన దిసాలే విద్యార్తులను పాఠశాలను ఆదర్శంగా తీర్చి దిద్దారు. ఆయన పాఠశాలలో అడుగు పెట్టిన సమయంలోదాని రూపు రేకలు పాఠశాలలా లేవు. ఓ వైపు గోదాముగా మరో వైపు గోవులను కట్టేసిన గోశాలగా ఉన్న పాఠశాలను ఓపికతో ఎంతో అదంగా తీర్చి దిద్దారు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలను భవణాన్ని గ్రామస్థుల సహకారంతో అభివృద్ధి చేసారు. గ్రామంలో బాలికా విద్యాను ప్రోత్సహించారు. ఆడియో, విజువల్ పాఠాలు స్వయంగా రూపొందించి విద్యార్థులకు అర్దం అయ్యే రీతిలో భోదించారు. కేవలం పాఠ్యాంశాల భోదనకే పరిమితం కాకుండా విద్యా్రతులకు సామాజిస స్థితిగతులు,సహజ వనరుల పట్ల అవగాహన కల్పించేందుకు వారిని క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకు వెళ్ళేవారు.

తనకు లభించిన నగదు బహుమతితో స్వంతంగా కారాలు కొంటానని అందమైన ఇళ్ళు కట్టుకుంటానని దిసాలే చెప్పలేదు. తనకు లభించిన ప్రైజ్ మనీలో సగం తనతో పాటీ పడిన వివిద దేశాల ఉపాధ్యాయులకు పంచుతానని చెప్పాడు. మిగతా సగం ప్రైజ్ మనీతో ఓ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వెనుక బడిన తరగతుల విద్యార్థులను విద్యారంగంలో ప్రోత్సహించేందుకు కేటాయిస్తానని ఎంతో ఉన్నత మైన ఆశయాన్ని ప్రకటించాడు.. ది గ్రేట్ రంజిత్ సిన్ఙ్ దిసాలే.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు