కాంగ్రేస్ లో ఉత్తమ్ సారధ్యం ముగిసింది - టిపిసిసి పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్


 జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీకి ఏ మాత్రం ఆశాజనకంగా ఫలితాలు రాక పోగా రెండే రెండు సీట్లు గెలిచి పూర్తిగా అభాసు పాలు కావడంతో తెలంగాణ కాంగ్రేస్ పార్టి అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసారు. రాజీనామా లేఖను ఏఐసిసికి పంపించారని పార్టి వర్గాలు తెలిపాయి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఉప్పల్ ,ఏఎస్ రావు నగర్ లో రెండు చోట్ల మాత్రమే కాంగ్రేస్ పార్టి అభ్యర్థులు గెలిచారు. ఎన్నికలకు ముందే కాంగ్రేస్ పార్టీ నుండి పలువురు బిజెపిలో చేరారు. మాజి మేయర్ బండ కార్తీక రెడ్డి బిజెపిలో చేరారు. విజయ శాంతి తీవ్ర అసంతృప్తిలో కొనసాగుతూ బిజెపిలో చేర బోతున్నారనే వార్తలు వచ్చాయి. మాజి ఎంపి కొండా విశ్వేశ్వర్  రెడ్డి కూడ బిజెపిలో చేరబోతున్నారని వార్తలు  వచ్చాయి.  జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపింది. టిఆర్ఎస్ ను ఎదురించే సత్తా బిజెపికే  ఉందని బాలెట్ ఓట్లలో బిజెపికి లభించిన ఆధిక్యత అనంతరం ట్వీట్ చేసారు. జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో టిఆర్ఎస్ కు నువ్వా నేనా అన్నంత పోటి ఇచ్చిన బిజెపి ఇక ఆపరేషన్ ఆకర్ష్ పేరిట పార్టీలో చేరికలు ముమ్మరం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఈ పరిస్టితులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం.  వాస్తవానికి ఉత్తమ్  దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరమే రాజీనామా చేయాల్సి ఉంది. దుబ్బాక ఫలితాల అనంతరం ఉత్తమ్ తన పదవికి రాజీనామా చేయాలని స్వంత పార్టీ నాయకులే గుస గుస లాడారు. ఉత్తమ్ తో లాభ ంలేదని ఆయన పార్టీని ఏ మాత్రం ఇక కాపాడ లేరని కొన్ని చోట్ల పార్టి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. వరంగల్ లో ఆయన దిష్టి బొమ్మను దగ్దం చేసారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు