మొదటి రోజు నుండే కరోనా నియంత్రణకు కార్యచరణ - జో బైడెన్

 


అగ్ర రాజ్యం అమెరికాలో ట్రంప్ పాలనకు చరమ గీతం పాడారు. ఎన్నికల్లో ట్రంప్ కన్నా మించిన ఓట్లతో డెమెక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ అమెరికన్ల మనస్సు గెలిచారు. ఎన్నికల ఫలితాలు సంపూర్ణంగా వెల్లడి అయ్యేందుకు సాంకేతికపరంగా ఆలస్యం అవుతున్నా జో బెడైన్ గెలుపు ఖాయమైంది. దాంతో ఆయన అమెరికా ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ప్రాంతాలు మతాలకు అతీతంగా అమెరికన్లు మార్పు కోరు కుంటున్నారని ట్రంప్ పై 40 లక్షల మెజార్టీతో గెలవ బోతున్నానని 74 మిలియన్ల ప్రజలు తనకు ఓటు వేసారని  తెలిపారు. జార్జియీనీ, పెన్సిల్వేనియాలో 24 గంటలక్రితం ఉన్న పరిస్థితి ఇక లేదు. రెండు చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నామని అన్నారు.

 ఇక కాలయాపన లేకుండా తక్షణం కార్య క్షేత్రం లోకి దిగనున్నట్లు జో బైడెన్ శుక్రవారం ప్రకటించారు. ఎ్ననికల ఫలితాల మేరకు 300 కు పైగా ఎలక్టోరల్ కాలేజి ఓట్లు గెలుచుకో బోతున్నామని తెలిపారు. ఎకానమి, కరోనా, పర్యావరణ తదితర అంశాలపై నిపుణులతో చర్చించేందుకు ఈ రోజు రాత్రే సమావేశం కానున్నట్లు తెలిపారు. కరోనా తెచ్చిన కష్టాలు భాదాకరమని తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కరానా వైరస్ నియంత్రణకు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. కరోనాతో తమ వాళ్లను కోల్పోయిన వారి భాదలు అర్దం చేసుకోగలనని అయితే లోటు ఏ మాత్రం తీర్చలేనని కాని ఇక నుంచి అమెరికన్లను కాపాడేందుకు తగిన చర్యలకు పూనుకుంటానని వివరించారు.  ఇక నుంచి ఎవరిని విడగొట్టే రాజకీయాలు ఉండబోవని అందరిని ఐక్యం చేసే రాజకీయాలే ఉంటాయని అన్నారు. రాజకీయమంటే ప్రజాసేవే నని పేర్కొన్నారు. ఎన్నికలు జరిగిన వేళ క్లిష్ట పరిస్థితులు ఎదురు అవుతాయని ఆందోళనలు ఉద్రిక్తతలు ఉంటాయని ఈ సమయంలో ప్రజలు సహనం పాటించాలని కోరారు.

  

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు