వైల్డ్ డాగ్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసి ఇంటి ముఖం పట్టిన నాగార్జున


 వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తి చేసుకుని  ఇంటి ముఖం పట్టినట్లు నాగార్జున చిత్రాలతో సహా ట్వీట్ చేసారు. 

బిగ్ బాస్  సీజన్ 4 హోస్ట్ చేస్తున్న నాగార్జున గత మూడు వారాలుగా  సెలవు  తీసుకుని వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లాడు.  మనాలి, రోహ్ తాంగ్ కనుమల్లో  ఏకబిగిన జరిగిన షూటింగ్ లో నాగార్జున తన షెడ్యూల్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాలో నాగార్జున  విజయ్ వర్మపేరిట నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సి( ఎన్ఐఏ) అధికారిగా నటిస్తున్నారు.

చిత్ర బృందాన్ని వీడడం ఎంతో భాదాకరంగా ఉందని నాగార్జున పేర్కొన్నారు.  ఎంతో అందమైన హిమాలాయలను వదిలి  రావడం మరింత భాదాకరంగా ఉందని అన్నారు. నిర్మాతలు అన్వేష్ రెడ్డి,నిరంజన్ రెడ్డి లు మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ్ సరసన దియా మీర్జా  నటిస్తుండగా  సయామీ ఖేర్  మరో ప్రముఖ పాత్రలో నటిస్తోంది. అహిషోర్ సోలొమన్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్,అడ్వెంచర్,థ్రిల్లర్ సినిమాల లాక్ డౌన్ మొదలయ్యే నాటికి హైదరాబాద్ లోని  రామోజి స్టూడియోలో  భారి సెట్లు వేసి చిత్రీకరించారు. లాక్ ప్రారంభం ఆయిన తర్వాత  షూటింగ్ నిలిచి పోయింది.

ఈ చ్తిత్రంపై భారి అంచనాలు పెట్టుకున్నారు. నాగార్జునకు గత కొంత కాలంగా సక్సెస్ సినిమాలు  లేక పోవడంతో ఎంతో శ్రద్ద తీసుకుని ప్రత్యేక పాత్రలో నటించారు.  రొటీన్ కు భిన్నమైన ఫైట్ సీన్లలో నాగార్జున నటించారు. 


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు