ఇంటిని కొలవద్దు - టేపు కనిపిస్తే ఎంపీవోలపై చర్యలు

 వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ లో గందరగోళమైన పరిస్థితులకు తావు లేకుండ తాజా గైడ్ లైన్స్ జారి అయ్యాయి




  • యజమాని చెప్పిందే ఆన్‌లైన్‌లో నమోదుచేయాలి
  • టేపు కనిపిస్తే ఎంపీవోలపై చర్యలు
  • నాన్‌ మ్యాండేటరీ వివరాలను  గ్రామాల్లో టీఎస్‌ఎన్‌ఏపీ యాప్‌లో ఆన్‌లైన్‌ చేసేప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటిని కొలువద్దని రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశించింది. ఇండ్లను ఆన్‌లైన్‌చేసే సిబ్బంది వద్ద టేపు కనిపిస్తే ఎంపీవో (మండల పం చాయతీ అధికారుల)పై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. యాప్‌లోఉన్న ఇల్లు, స్థలం కొలతలకు.. ప్రస్తుతం ఉన్న కొలతలకు తేడా ఉన్నదనిపిస్తే కంటితోచూసి ప్రాథమిక అంచనాకు రావాలని, లే దా అనుభవం ఉన్నవారిని అడిగి తెలుసుకోవాల ని సూచించింది. చివరగా యజమాని డిక్లరేషన్‌ ఇచ్చిన కొలతలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నది.  
  • యాప్‌లో ఉన్న అన్ని వివరాలను తప్పనిసరిగా నమోదుచేయాలి. నాన్‌ మ్యాండేటరీ కాలమ్స్‌ను తప్పనిసరి కాదంటూ నమోదుచేయకుండా వదిలేయకూడదు. మ్యాండేటరీ కాదని అరకొర సమాచారం నమోదుచేసి వదిలేస్తే యాప్‌ అంగీకరిస్తుందేమో కానీ.. అది సరైన విధానంకాదు. 
  • ఇంటి యజమాని వివరాలన్నీ ఇవ్వని పక్షంలో కేవలం సేవ్‌ చేసుకొని పెట్టాలి. వివరాలు ఎ ప్పుడు సమర్పిస్తే అప్పుడే ఆన్‌లైన్‌లోకి ఎక్కించాలి. ఇలా అసంపూర్తిగా సేవ్‌ చేసిన ఇండ్ల వివరాలు, అందుకుగల కారణాలను ఓ రిజిస్టర్‌లో నమోదుచేసుకోవాలి. 
  • యాప్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే డీపీఎంలకు, లాగిన్‌ లేదా సబ్జెక్ట్‌ సమస్యలు వస్తే ఎంపీవోలు, డీఎల్‌పీవోలను అడిగి తెలుసుకోవాలి. ఇంటి యజమానిని ఫొటో తీసే విషయంలో సమస్యలు వస్తే యాప్‌ను గూగుల్‌ క్రోమ్‌ ద్వారా ఓపెన్‌ చేసుకోవాలి. అప్పటికీ కానిపక్షంలో వేరే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను ఉపయోగించాలి. 
  • యజమాని ఇంటివద్ద కాకుండా వేరేచోట నుం చి ఇండ్లను ఆన్‌లైన్‌ చేయొద్దు. అలాచేస్తే యాప్‌లోఉన్న జియోకోడ్స్‌తో ఏ లొకేషన్‌లో ఆన్‌లైన్‌ చేశారనేది చెక్‌ చేసినప్పుడు పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు తెలిసిపోతుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్‌చేసే కార్యదర్శులపై చర్యలు ఉంటాయి. సిగ్నల్‌ సమస్యలు వస్తే పక్కనున్న వారి ఫోన్‌నుంచి హాట్‌స్పాట్‌ తీసుకొని ప్రక్రియను పూర్తిచేయాలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు