ఎపిలో విద్యాకానుక పథకం ప్రారంభం - జగన్ పథకాల్లో ఈ పథకం కూడ వినూతనమే

ప్రతి విద్యార్థికి స్కూలు బ్యాగు

మూడు జతల దుస్తులు ఒక షూ జత

పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ 


ఎన్నికల సమయంలో ప్రకటించిన నవరత్నాలలో భాగంగా ఎపి ముఖ్యమంత్రి   వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని అమలు చేశారు. నవరత్నాలలో లేని సరికొత్త పథకాలు కూడ అనేకం ప్రారంభించారు. ఎపిలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఏ రాష్ర్టంలో కూడ ఇప్పటి వరకు అమలు కాలేదు అంటే ఈ పథకాలన్ని వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రత్యేకతగా చెప్పవచ్చు


స్కూలుకు వెళ్లే  విద్యార్థులు ఇక తమకు చెప్పులులేవని బ్యాగులు లేవని పుస్తకాలు లేవని భాదపడే అవసరం లేదు. ఎందుకంటే ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యాకానుక పథకం పేరిట  మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.  రాష్ర్టంలో 43 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద  బ్యాగులు, పుస్తకాలు, దుస్తులు అంద చేస్తారు.  మొత్తం 650 కోట్లు ఈ పథకానికి ఖర్చు  వ్యయం చేయనున్నారు.విద్యాకానుకలో భాగంగా ప్రతి విద్యార్థికి ఓ స్కూలు బ్యాగు, 3 జతల దుస్తులు, బెల్టు,ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు వాటితో పాటు ఆయా తరగతులను బట్టి పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు అంద చేస్తారు. విద్యార్థుల దుస్తులకు సంభందించిన కుట్టు కూళ్ళకు అయ్యే చార్జీలు కూడ ప్రభుత్వం భరిస్తుంది. ఇందు కోసం వారి తల్లుల బాంకు ఖాతాలలో నేరుగా కుట్టుకూలి చార్జీలు జమ చేస్తారు. 

వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం లక్షలాది మంది నిరుపేద విద్యార్థులను ఆదుకుంది.  వృత్తి విద్యా  కోర్సులకు నోచుకోలేని విద్యార్దులు అనేక మంది సాంకేతిక విద్యలో పట్టభద్రులై ఉపాధి పొందుతున్నారు. గత 15 సంవత్సరాలుగా ఫీజు రిఎంబర్స్ మెంట్ పథకం ఆనాటి ఉమ్మడి రాష్ర్టంలో  అమలు జరిగింది. ప్రస్తుతం తెలంగాణ, ఎపి రాష్ట్రాలలో కూడ అమలు అవుతోంది. మద్యలో వచచిన పాలకులు ఈ పథకానికి గండి కొట్టే ప్రయత్నాలు చేసినా ప్రజల్లో నుండి వచ్చిన వ్యతిరేకత కారణంగా కొనసాగించక తప్పలేదు.  

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు