కరోనా కల్లోలం - బాద్ షా డిశ్చార్జి - అమిత్ షా అడ్మిట్



రోజు రోజుకూ కరోనా మహమ్మారి తన హస్తాలు చాటుతోంది. వ్యాధి పీడితుల జాబితాల్లో సామాన్యులే కాదు  మంత్రులు, విఐపీలు, వివిఐపీలు చేరి పోతున్నారు.  ఉత్తర ప్రదేశ్ రాష్ర్ట సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమలా రాణి వరున్ కరోనా వ్యాధి సోకి చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్‌ పురోహిత్‌కు కరోనా వైరస్‌ సోకింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా సోకి ఆసుపత్రిలో చేరినట్లుఆయన స్వయంగా ట్వీట్ చేశారు. కాగా గత కొన్ని రోజులుగా కరోనా వ్యాది సోకి ఆసుపత్రిలో చకిత్స పొందిన బిగ్ బి అమితాబ్ బచ్చన్  పూర్తిగా కోలుకుని ఆదివారం ఆసుపత్రి నుండి డిస్చార్జి అయ్యారు. అఇతే ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్  మాత్రం ఇంతా ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నాడు. అమితాబ్‌ కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకగా, ఇటీవలే ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య, ఇద్దరు కోలుకున్నారు.

నిలకడగా అమిత్ షా ఆరోగ్యం .....
తన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందన్న అమిత్‌ షా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచనతో ఆస్పత్రిలో చేరానని తెలిపారు. ఈ మేరకు హిందీలో ట్వీట్‌ చేశారు అమిత్‌ షా. తనకు నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షలో పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చిందని ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందన్న అమిత్‌ షా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు