మన దేశంలో కోవిడ్ 19 (కరోన) రోజు రోజుకూ బలహీన పడుతోందా?

వాక్సిన్ రాకమునుపే
బయట పడతామా!?

భారత్ లో కోవిడ్ 19 తగ్గుముఖం పడుతోందా..వాక్సిన్ వచ్చే లోగానే మహమ్మారిపై విజయం సాధించే దిశగా ఇండియా ముందుకు వెళ్తుందా..ప్రస్తుతం రోజురోజుకీ పెరుగుతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఈ ప్రశ్నలు కాస్త ఆశ్చర్యంగాను..మించి హాస్యాస్పదంగానూ కూడా అనిపించవచ్చు. కాని కొన్ని సాంకేతిక కోణాల నుంచి విశ్లేషిస్తే అదీ నిజమేనేమో అని కూడా తోచవచ్చు..
       కోవిడ్ 19 వంటి  ఒక పాండమిక్ ముగింపు R రేట్ మీద ఆధారపడి ఉంటుంది.అంటే రిప్రొడక్షన్ రేట్ అన్న మాట.ఉధృతి మొదలైన దశలో ఇది రెండుగా ఉంది.అంటే వైరస్ సోకిన ఒక వ్యక్తి ద్వారా ఇద్దరికి వ్యాపించడం..ఆ ఇద్దరి నుంచి మరో ఇద్దరికి..అలా మొత్తానికి వ్యాపించి పాండమిక్ స్థాయికి వెళ్ళడం. ఇప్పుడది మన దేశంలోని పెద్ద రాష్ట్రాలు కనీసం ఒకటికి చేరింది.అంటే ఒక రోగి నుంచి ఇంకొకరికి మాత్రమే...ఆ ఒకరి నుంచి మరొకరికి మాత్రమే వ్యాపించడం.ఇలా R  రేట్ అనేది ఒకటి కంటే తక్కువ స్థాయికి చేరినప్పుడు పాండమిక్ అంతమైపోయినట్టుగా భావించవచ్చు.ఇలాంటి ఓ స్థితికి ముందుగా గుజరాత్ చేరుకుంది.ఢిల్లీలో అయితే R ఏకంగా .75 కి చేరింది.మహారాష్ట్ర,అస్సాం,
తమిళనాడు,ఛత్తీస్ ఘడ్ కూడా కొంతవరకు సాధించినట్టే.ఉత్తర్ ప్రదేశ్,బీహార్,పంజాబ్ రాష్ట్రాలు ఈ కోణంలో మెరుగుపడితే ఇండియా ఈ విషయంలో మెరుగైన స్థితికి చేరుకుని ప్రమాదకర
స్థాయి నుంచి
తప్పించుకోగలుగుతుంది..
    *ఇ.సురేష్ కుమార్*
        19.08.20..10.40 PM

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు