శ్రీశైలం పవర్ ప్లాంటు ప్రమాదంపై ‌ సీఐడీ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్



శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీఐడీ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌‌ను నియమించారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయి కనిపించకుండా పోయిన వారంతా మరణించారు. విద్యుత్ కేంద్రంలో అలుముకున్న దట్టమైన పొగ కారణంగా లోపల మొత్తం తొమ్మిది మంది ఉద్యోగులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. మిగలిన వాటి కోసం సహాయక చర్యల్లో సీఐఎస్‌ఎఫ్‌, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో పలువురు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు.

జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొలుత ప్యానల్‌ బోర్డులో అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు చెలరేగి జలవిద్యుత్‌ కేంద్రం మొత్తం వ్యాపించాయి. సిబ్బందిలో పలువురు తప్పించుకోగా, 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. సహాయక చర్యల్లో సీఐఎస్‌ఎఫ్‌, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో పలువురు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు