రామమందిరం నిర్మాణానికి ముహూర్తం ఖరారు - ఆగస్ట్ 3 లేదా 5 తేదీలలో భూమి పూజ- ప్రదాన మంత్రినిఆహ్వానించిన కమిటి

అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభంకానున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్వర్యంలో శనివారం జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు ముహూర్తం తేది ఖరారు చేస్తూ తీర్మాణం చేశారు. ఆగస్ట్ 3 లేదా 5 తేదీలలో భూము పూజ నిర్వహించాలని నిర్ణయించారు. భూమి పుజకు హాజరు కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు.  ప్రధానమంత్రి వీలుని బట్టి ఆయన హాజరయ్యే రోజే భూమి పూజ జరగనుందని ట్రస్ట్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
భూమి పూజ జరిగిన రోజు నుండే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఆలయ నిర్మాణానికి నిధులు పోగు చేయాలని నిర్ణయించారు. కాని కరోనా తీవ్రత నేపధ్యంలో ప్రస్తుతం నిధులు పోగు చేయడం జరిగే పనికాదని అయితే ఆలయం నిర్మాణ పనులు మాత్రం  ఎట్టి పరిస్థితుల లోనైనా కొనసాగించి తీరాలని నిర్ణయించామని ట్రస్ట్ జనరల్ సెక్రెటరి చంపత్ రాయ్ తెలిపారు. దేశ వ్యప్తంగా మొత్తం 4 లక్షల ప్రదేశాలలో కనీసం 10 కోట్ల మంది నుండి ఆలయం నిర్మాణం కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం లార్సన్ అండ్ టర్బో సంస్థ ఆలయం నిర్మాణ స్థలంలో పరీక్షల కోసం మట్టి నమూనాలు సేకరిస్తోంది.
ఆలయ నిర్మాణం పనులు మూడు నుండి మూడున్నర సంవత్సరాల లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు