స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణికి బిజెపీలో కీలక పదవి - బీజేపీ తమిళనాడు యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా విద్యారాణిగంధపు స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి (29)కి బిజెపీలో కీలక పదవి కట్టబెట్టారు. ఆమెను బీజేపీ తమిళనాడు యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా నియమించారు.గంధపుచెక్కలు,ఏనుగు దంతాల స్మగ్లింగ్ తో ఒకప్పుడు తమిళనాడు,కర్ణాటక,కేరళ రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్ కు ఇప్పటికి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.వృత్తి రీత్యా న్యాయవాదిగా స్థిరపడిన వీరప్పన్ కూతురు విద్యారాణి  ఇటీవలె బిజెపి తీర్థం పుచ్చుకుంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యారాణి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేసే అవకాశం లేక పోలేదు.వీరప్పన్ కు కృష్ణగిరి ప్రాంతంలో ఉన్న వోటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని బిజెపి విద్యారాణి కి పార్టీలో అధిక ప్రాధాన్యత కల్పించిందనే విశ్లేషణలు వచ్చాయి.వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి ప్రస్తుతం మైసూరు జైల్లో ఉన్నారు. ఆమె జామీ పై విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కూతురు విద్యారామి భందు వర్గాల వద్ద ఉండి లా చదివి న్యాయ వాద వృత్తి చేపట్టారు.ఎప్పుడో చిన్ తనంలో ఒక్క సారి మాత్రమే విద్యా రాణి తన తండ్రి వీరప్పన్ చూడగలిగింది. ఎక్కువ శాతం వీరప్పన్ అడవిలో ఉండడం వల్ల తండ్రితో గడిపిన జ్ఞాపకాలు లేవు.

'బాల్యం అంతగా గుర్తులేని వయసులో తండ్రిని ఒక సారి చూశాను..బహుశా నాకపుడు ఆరేళ్ల వయస్సు.. కర్నాటక రాష్ర్టం లో అడవిని ఆనుకుని ఉన్న హనూరు ప్రాంతంలోని గోపినాధం గ్రామంలో ఉన్నపుడు నేను ఆడుకుంటుండగా నా తండ్రి వచ్చి కల్సి నాతో మాట్లాడాడు. బాగా చదువుకోవాలని డాక్టర్ అయి ప్రజలకు సేవ చేయాలని చెప్పాడు..కేవలం కొద్దిద నిమిషాలే నాతో గడిపాడు ఆ తర్వాత వెళ్లి పోయాడు...నాకు ఊహ తెలిసి పరిస్థితులు అర్దం అయ్యే నాటికి నా తండ్రి ఈ లోకం లో లేకుండా పోయాడు ' అని విద్యారాణి ఓ ఆంగ్ల దినపత్రిక రిపోర్టర్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
'నా తండ్రి ఏ పరిస్థితులలో అలాంటి ఖఠిన మైన మార్గం ఎంచుకున్నారో   నాకు తెలియదు.... కాని ఆయన గురించి చాలా మంది బాగా గొప్పగా  చెప్పకోవడం విన్నాను... ఆయన సామాజిక సేవలను బాగా మెచ్చుకునే వారు... ఆయన సామాజిక సేవా నిరతని స్పూర్తిగా తీసుకుని నేను కూడ సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్లపడ్డాను' అని విద్యారాణి తెలిపారు. విద్యారాణి ప్రస్తతం చిన్న పిల్లలకోసం ప్లే స్కూల్ నడుపుతోంది. తనకు రాజకీయాలు అంటే తెలియవని అయితే పార్టి స్థానిక  నాయకుడు ఒకరు తనను కేంద్ర మంత్రి పోన్ రాధాకృష్ణన్ వద్దకు తీసుకు వెళ్లి పార్టీలో చేర్పించాడని తెలిపారు. 2011 లో తల్లి ముత్తు లక్ష్మికి  తన కులం వారికి ఇష్టం లేకున్నా వారితో పారాడి తాను ఇష్ట పడి ప్రేమించిన వ్యక్తిని విద్యారాణి వివాహం చేసుకుంది.
సంఖ్యా బలం కలిగిన వన్నియార్స్ అనే  ఓబిసి కులానికి చెందిన వీరప్పన్ ను  ఆయన కులం వారంతా ఇప్పటికి   బాగా గౌరవిస్తారు. బిజెపి కూడ వారి వోటు బలగం చూసి విద్యారాణిని పట్టుబట్టి  పార్టీలో చేర్పుకుంది.
గంధపు చెక్కల వీరప్పన్ జీవితం అంతా రక్త చరితే - వందలాది మంది వీరప్పన్ చేతిలో హతం

ఏనుగు దంతాలు, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పేరు తెలియని వారుండరు.దక్షిణ భారత దేశంలో తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ర్టాలను గడ గడలాడించాడు.కన్నడ కంఠీరవగా పేరుగాంచిన ప్రముఖ యాక్టర్ డాక్టర్ రా జ్ కుమార్ ను 2000 సంవత్సరంలో కిడ్నాప్ చేసి 108 రోజుల అనంతరం ఏ హాని తలపెట్టకుండా ప్రాణాలతో విడిచి పెట్టాడు. వీరప్పన్ ను పట్టుకునే వేటలో అనేక మంది పోలీసులు, ఫారెస్ట్ అధికారులు చనిపోయారు.కర్ణాటక రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐ.ఎ.ఎస్.అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. వీరప్పన్ చేతిలో సుమారు 200 మందికి పైగా  ప్రాణాలు పొగొట్టుకున్నారు.ఇందులో అధిక శాతం పోలీసులు ఉన్నారు.ఇన్ ఫార్మర్ల పేరిట అనుమానంతో వీరప్పన్ అనేక మందిని నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు.

ఆపరేషన్ కుకూన్ పేరుతో వీరప్పన్ ను పట్టుకునేందుకు ఐపిఎస్ అధికారి విజయకుమార్ నాయకత్వంలో ఏర్పడిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ 1991 నుండి 2004 వరకు సుదీర్ఘ కాలం పనిచేసింది.చివరికి  అక్టబర్ 18 న వీరప్పన్ తో పాటు అతని అనుచరులు సేతుకాళి గోవిందన్,చంద్రె గౌడ,సేతుమునిలను  టాస్క్ ఫోర్స్ చుట్టుముట్టి భారి ఎన్ కౌంటర్ లో కాల్చిచంపడంతో వీరప్పన్ కథ ముగిసింది.

రాంగోపాల్ వర్మ వీరప్పన్ జీవిత చరిత్ర పై 'కిల్లింగ్ వీరప్పన్'పేరిట తీసిన సిన్మా బాక్స్ ఫీస్ హిట్ అయింది.ఈ సినిమాలో అభ్యంతరకర దృష్యాలు జొప్పించారని వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ సినిమా కథ సెకండ్ పార్ట్ తీస్తానని ప్రకటించిన రాంగోపాల్ వర్మ ఆ తర్వాత ఎందుకో ప్రయత్నాలు మానుకున్నారో లేక వాయిదా వేసుకున్నారో కాని సెకండ్ పార్ట్  సినిమా ముచ్చట ఎక్కడా ప్రస్తావించలేదు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు