తెలంగాణలో టీజేఎఫ్ ప్రజాపక్షపాతి

ఇరవై ఏడేళ్ల కిందట.. ఓ తెలుగు దినపత్రికలో స్ట్రింగర్‌గా చేరుతు న్న సందర్భంలో ఆ పత్రిక స్థానిక మేనేజర్ నుంచి ఓ నియామక పత్రం ఇచ్చారు. దాని ప్రకారం నా ప్రధాన వత్తి జర్నలిజం కాదు. ఉబుసు పోక వార్తా సేకరణను ఎంచుకున్నానని, అందుకోసం అకేషనల్ కాంట్రిబ్యూటర్‌గా నన్ను నియమిస్తున్నట్లు దాని సారాంశం. వత్తి అయినా, ప్రవత్తి అయినా ఆ నియామక పత్రం నన్ను జర్నలిస్టుని, విలేకరిని చేసింది. అప్పుడు విలేకరుల సమస్యల కోసం, బచావత్ వేజ్ బోర్డుకనుగుణంగా వేతనాలు ఇవ్వాలని పత్రికల యాజమాన్యాలను జర్న లిస్టు ట్రేడ్ యూనియన్ నాయకత్వాలు ఒత్తిడి తెచ్చేవి. దీంతో యాజమాన్యాలు కొత్త వ్యూహాలు అనుసరించాయి. తరువాతి కాలంలో నియామక పత్రాలు కూడా ఇవ్వడం బందైంది. కాంట్రా క్టు విధానం మొదలైంది. దీంతో కలం కార్మికుల కష్టాలూ తీవ్రమయ్యాయి. గ్రామీణ జర్నలిస్టుల సమస్యలు మరింత దుర్భరమయ్యాయి. ఆ వేజ్‌బోర్డుల అమలు కోసం ఉద్యమించడం ట్రేడ్ యూనియన్లకు శక్తికి మించిన పనైంది. పాలేకర్ వేజ్‌బోర్డు నుంచి మానిసానా సింగ్ వేజ్‌బోర్డు దాకా ఇలా ఒకదాని తరువాత ఒకటి వేజ్‌బోర్డులు వచ్చాయిపతిపాదనలు చేస్తూనే ఉన్నాయి. అమలు ను ఏయాజమాన్యాలు పట్టించుకోలేదు. ఉద్యోగ నియామకాలు అంటే.. కేవలం పే స్లిప్ లకే పరిమితం చేశాయి. అలాగే ఛానళ్ళు కూడా కాంట్రాక్టు విధానాలను సైతం అమలుపర్చని స్థితికి చేరా యి. కాస్ట్ కటింగ్‌పేరిట ఉదయం ఉన్న ఉద్యోగి సాయంత్రానికి తన ఉపాధి కోల్పోయే స్థితి నెలకొన్నది. రాను రాను మీడియాలో నియామకాలు మాటతోనే సరిపెట్టుకునే దుస్థితి వచ్చింది.
స్ట్రింగర్లకు కాలం సెంటీ మీటర్ల లెక్కన వేతనాలు ఇచ్చే స్థితి నుంచి, అది కూడా ఇవ్వకుండానే వెట్టిచాకిరీ చేయించుకుంటున్న స్థితి నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టు యూనియన్‌లు జీతాల కోసం,అపాయింట్‌మెంట్ లెటర్ల కోసం పోరాడటంలో ఎలాంటి విజయం సాధించలేదు. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి జర్నలిజం వత్తి ప్రజాస్వామిక భావజాలానికి, ప్రజా చైతన్యానికి సూచికలుగా నిలిచాయి. తెలుగు దినపత్రికా రంగంలో ఆంధ్రపత్రిక స్వాతంత్య్రోద్యమంలో గొప్ప పాత్ర నిర్వహించింది. నాటి నుంచి నేటి దాకా పత్రికా రం గం పాత్ర ఏదో స్థాయిలో ప్రజాపక్షపాతిగా ఉంటూ వస్తున్నది. అలాగే దశాబ్దకాలంగా తెలంగాణ ప్రాంత ప్రజాస్వామిక ఆకాంక్ష లు అస్తిత్వ పోరాటాలకు ప్రతిఫలంగా నిలిచిన తెలంగాణ ఉద్య మంలోనూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో పది జిల్లా ల తెలంగాణ పాత్రికేయులు అలాంటి పాత్ర నిర్వర్తిస్తూ వచ్చారు. ఇది సమాజ ఆకాంక్షలకు చిహ్నం. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆకాంక్షలను వ్యక్తీకరిస్తున్న క్రమంలో పాత్రికేయులుగా పత్రికా రచ నా వ్యాసాంగాన్ని వత్తిగా ఎంచుకున్న యువతరం ఆ బాధ్యతను తమభుజస్కందాల మీద వేసుకున్నది. ఇక్కడి సమాజ ఆకాంక్షలు ఆచరణాత్మకం అవుతున్నప్పుడు పాత్రికేయులుగా ఇక్కడి కలం కార్మికులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు నిర్మించారు. సమాజంలో భాగస్వాములైన పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ దశలో ఏపాత్ర నిర్వహించవచ్చో తెలంగాణ జర్నలిస్టులు ఆచరణ లో చూపారు. ఈక్రమంలో ఎన్నో రకాలుగా నిర్బంధాలకు గుర య్యారు. అనన్య త్యాగాలు చేశారు.
ప్రజాస్వామిక ఆకాంక్షలను ప్రతిఫలంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించబోతున్నది. ఇక్కడి కార్మికవర్గాలు తమ అస్తిత్వ ఆకాంక్షల ప్రతిరూపం తమ జీవితాలను మెరుగుపర్చగలదనే అభిప్రాయానికొచ్చాయి. అందుకోసం తమతమ రంగాల్లో సంఘటితమవుతున్నయి. అలాంటి సంఘటితశక్తిగా జర్నలిస్టులు సైతం రూపాంత రం చెందాల్సిన అవసరం ఉన్నది.తెలంగాణ జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్ కార్యాచరణలో కలం కార్మికులను క్రియాశీల కార్మికులుగా మార్చాల్సిన అవసరమున్నది. ఇది ఇప్పటి ఆవశ్యకత కూడా. జర్నలిస్టు ట్రేడ్ యూనియన్‌లు ప్రభుత్వాల నుంచి అందే సదుపాయాలతో పాటు, యాజమాన్యాల నుంచి జర్నలిస్టు కార్మికులు పొందాల్సిన హక్కుల గురించి కూడా చైతన్యం చేయాలి. అందుకోసం సంఘటిత ఉద్యమాలను బలోపేతం చేయాలి. ఉద్యమాలకు అవసరమైన రీతిలో కలం కార్మికులను సన్నద్ధం చేయాలి. అట్లాంటి సందర్భంలోనే కలం కార్మికులు కూడా వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందగలుగుతారు. పాత్రికేయరంగం బుద్ధిజీవుల సమాహారంగా చెప్పుకునే ఒక సంఘటన. ఈ సంఘటన సమాజాన్ని పునర్నిర్మాణం చేయడం లో దిశానిర్దేశకంగా నిలవాలి. తెలంగాణ పాత్రికేయ రంగం మిగ తా సమాజానికి ఒక దిక్సూచిగా నిలవాలనేది ఇక్కడి పాత్రికేయులుగా మనందరి ఉబలాటం. అలాంటి దిక్సూచి కర్తవ్యం దశాబ్ద కాలంగా తెలంగాణ జర్నలిస్టులు చేస్తూ వస్తున్నారు. రేపటి సమాజంలో తెలంగాణ కార్మిక కర్షక వర్గాలు, విద్యార్థి మేధావులు వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించే అంశంలోనూ ఆయా సమస్యల పట్ల ప్రజలను చైతన్యవంతం చేసే విషయంలో నూ పాత్రికేయులు సమాజంలో తమ ఫోర్త్‌ఎస్టేట్ కర్తవ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి. దీనికోసం గ్రామీణ ప్రాంతా ల్లో ఈవత్తిని ప్రవత్తిగా ఎంచుకుని సమాజ పునర్నిర్మాణం లక్ష్యం గా వెళుతున్న గ్రామీణ ప్రాంత విలేఖరుల బాగోగుల కోసం ఉద్యమాలు నిర్మించాలి.
వేతనాలను ఇప్పించడంలోనూ ఇతర ప్రాథ మిక హక్కులను అనుభవించడానికి వాళ్ళను ఉద్యమింపచేయడంలోనూ ట్రేడ్ యూనియన్ తన కర్తవ్యాన్ని నిర్దేశించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే జర్నలిస్టు ట్రేడ్ యూనియన్ సాధారణ ట్రేడ్ యూనియన్ల కర్తవ్యాలకు తోడు సామాజిక దక్కోణాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. రేపటి తెలంగాణ సమా జం అన్ని అంశాల్లోనూ పునర్నిర్మాణ కోణాన్ని ఆచరణాత్మకంగా చూడాలనుకుంటున్నది. అందుకోసం తెలంగాణలోని జర్నలిస్టులకున్నట్టుగానే, జర్నలిస్టులను సంఘటితం చేసే జర్నలిస్టు ట్రేడ్ యూనియన్లకు కూడా కొత్త లక్ష్యాలుంటాయి. సరికొత్త కర్తవ్యాలుంటాయి. అందుకోసం ప్రభుత్వాలకు కూడా దిశానిర్దేశం చేయగలిగే లక్ష్యాలను ఇక్కడి జర్నలిస్టుల ట్రేడ్ యూనియన్ తన ముం దుంచుకుంటుంది. ఇలా ఉండాలనేది సగటు జర్నలిస్టుల అభిప్రా యం. ఇలా ఈ సమాజంలోని లోటుపాట్లను ఎత్తి చూపే లక్ష్యం తనదిగా గల జర్నలిజం వత్తి మరింత పదునైన రీతిలో పనిచేయగలుగుతుంది. మరిన్ని పునర్నిర్మాణ లక్ష్యాలను సమాజం ముం దుంచగలుగుతుంది. తెలంగాణ జర్నలిస్ట్ ట్రేడ్ యూనియన్ ఉద్య మం ఎంచుకునే లక్ష్యాలలో ప్రధానమైంది భవిష్యత్‌లో ఎదురవబోయే సవాళ్లను అధిగమించేందుకు ఇక్కడి కలం కార్మికులను సమాయత్తం చేసే ప్రక్రియ. తెలంగాణ సాధన సందర్భంలో ఇక్క డి పాత్రికేయులు అనుసరించిన సంఘటిత పోరాట పటిమను తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా అసర్ట్ చేసుకోవడానికి ఇక్క డి పాత్రికేయులు కషి చేయాలి. దానికి జర్నలిస్టు ట్రేడ్ యూనియన్లు దిశానిర్దేశం చేయాలి.
-పెండ్యాల కొండల్
జర్నలిస్టు
January 24, 2014 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు