ఓటర్ వివరాలు పోలింగ్ బూత్ వివరాలు తెల్సుకోవడం ఇక చాలా ఈజీ

 


హనుమకొండ: ఎన్నికలకు సంబంధించి పలు వివరాలను తెలుసుకునేందుకు జిల్లా ఓటర్లకు వాట్సప్ నకు సంబంధించిన చాట్ బాట్ (chatbot)ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.


 దీనిని ఉపయోగించేందుకు క్యూఆర్ కోడ్ గానీ లేదా 9704560805 నెంబర్ను గాని

 సంప్రదించినట్లయితే ఓటర్ హెల్ప్ లైన్ తోపాటు ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.


 ఈ యాప్ లో మొదటగా హాయ్ అని సందేశం పంపించాలని, అలా సందేశం 

 పంపిన వెంటనే వాట్సాప్ లో ఓటర్ హెల్ప్ లైన్, పిడబ్ల్యుడి హెల్ప్ లైన్, పోలింగ్ బూత్ వివరాలు అనే మూడు ఆప్షన్లు ఇవ్వబడతాయని అన్నారు. 


 పిడబ్ల్యుడి హెల్ప్ లైన్ లో గూగుల్ లింకు ను ఉపయోగించి వీడియో కాల్ చేయడం ద్వారా ఎలక్షన్ కంట్రోల్  రూమ్ లోని అధికారులతో నేరుగా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకుమాట్లాడే అవకాశం ఉందన్నారు. బదిరుల కోసం కంట్రోల్ రూమ్ లో సైన్ లాంగ్వేజ్ ( సంజ్ఞల)ద్వారా సమాచారం తెలిపేందుకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అదేవిధంగా ఎలక్షన్ సంబంధించిన సందేశాలు,  ఆకర్షణీయమైన సెల్ఫీలను 

Voterspointhnk. in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చునని  కలెక్టర్ పేర్కొన్నారు.


ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.


 హనుమకొండ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఓటర్ల సౌలభ్యం కోసం వరంగల్ ఎన్ఐటి విద్యార్థులు, అధ్యాపక బృందం స్వచ్ఛందంగా రూపొందించారని అధికారులు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు