భారత్ ఎన్నికలు @ 2024.._మళ్లీ ఓ మహా యాగం..!

 


(ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వ్యాసానికి మరికొన్ని అంశాలను జోడించి నేను రాసిన వ్యాసం ఇది..

చదవండి..!)


*_సురేష్..9948546286_*

            జర్నలిస్ట్


*_భారత్ ఎన్నికలు @ 2024.._*
*_మళ్లీ ఓ మహా యాగం..!_*


✍️✍️✍️✍️✍️✍️✍️


మన దేశంలో జరిగే ఎన్నికల గురించిన అద్భుతమైన కథనం ఇది..


ఎన్నికల అక్రమాలు..

అభ్యర్థుల ఆగడాలు..

మితిమీరిన ఖర్చులు..

డబ్బుల పంపిణీ..

ఓటర్లకు ప్రలోభాలు..

పోలింగ్ నాడు జరిగే 

హింస..దౌర్జన్య కాండలు..

ఫలితాల వెల్లడి..

ఒకవేళ హంగ్ సభలు ఏర్పడిన పరిస్థితుల్లో

జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియలు..

వీటన్నిటినీ ఒకసారి పక్కన పెట్టి ప్రపంచంలోనే అతి పెద్ద

ప్రజాస్వామ్య దేశంలో

జరుగుతున్న ఎన్నికల క్రతువు ముఖ్యాంశాలను 

ఒకసారి పరికిద్దాం..


భారత్ లో ఎన్నికలంటే

నిజంగానే ఈ భూమ్మీద జరిగే

అతి గొప్ప యాగం..

700 మిలియన్ల ఓటర్లు..

ప్రజాస్వామ్య మర్యాదలను పాటిస్తూ..రాజ్యాంగాన్ని గౌరవిస్తూ తమ వంతు పాత్ర పోషించే అద్భుత ఘట్టం..

అతి ప్రాచీనమైన తమ సంస్కృతిని భావి తరాలకు

మోసుకుపోయే గొప్ప కర్మ ఇది..పొరుగునే ఉన్న పాకిస్తాన్..చైనా..బర్మా దేశాల్లో జరిగినట్టు కాకుండా

కొన్ని విలువలతో కూడిన

ఉన్నత ప్రజాస్వామ్య ప్రక్రియ

భారత దేశంలో ఎన్నికలంటే..


మిగిలిన ఎన్నో దేశాలతో పోలిస్తే ఇండియాలో పరిస్థితులు విభిన్నం..

ప్రధానంగా ఉగ్రవాదాన్ని 

ఎదుర్కొంటూ

అభివృద్ధి సాధించడం

సామాన్యమైన విషయం కాదు..


మిగిలిన ప్రపంచం వేరు..ఇండియా వేరు.. 

విభిన్న భాషలు 

మాట్లాడే వ్యక్తులు..

భిన్న సంస్కృతులు..

పెద్ద దేశం..

రకరకాల ఆలోచనలు..

లెక్కకు మించిన పార్టీలు..

ఎన్నో మతాలు..కులాలు..

వీటన్నిటి మధ్య ఉనికిని కాపాడుకోవడమే దుర్లభం.

అయితే తన ఉనికిని గొప్పగా

చాటుకుంటూ భారతదేశం సాధిస్తున్న పురోభివృద్ధి శ్లాఘనీయం..!


*_ఇండియా అంటే.._*


హిందూయిజం..

బుద్ధిజం..జైనిజం..

సిక్కిజం 

ఊపిరి పోసుకున్న నేల..


ప్రపంచంలోనే రెండవ 

అతి పెద్ద ముస్లిం దేశం..


2000 సంవత్సరాలకు పైగా

క్రైస్తవ మతం పాతుకు పోయి ఉన్న మతసహన రాజ్యం..


దలైలామాకి సైతం ఆశ్రయం ఇచ్చిన భూమి..


పర్షియా నుంచి గెంటివేతకు

గురైన జోరోస్ట్రయిన్లను

తన లోగిలిలో చేర్చుకున్న

గొప్ప గడ్డ..


అర్మేనియన్లు..సిరియన్లు..

ఇంకా ఎందరో విదేశీయులు

ఈ నేల నచ్చి ఇక్కడ శాశ్వత నివాసం కల్పించుకున్న 

గొప్ప చరిత్ర..


గడచిన 2000 సంవత్సరాల్లో కనీసం 1500 యేళ్లు ప్రపంచంలోనే ఆర్థికంగా అత్యంత ఉన్నత దేశం..రెండు వందల ఏళ్లుగా రెండవ అతి పెద్ద 

ఆర్థిక వ్యవస్థ..


ఇంకా గొప్ప అంశాలు చూద్దాం..


ఇక్కడ ముగ్గురు ముస్లిములు అధ్యక్షులుగా పని చేశారు..


ఒక సిక్కు కూడా రాష్ట్రపతిగా.. 

మరో సిక్కు

ప్రధానిగా వ్యవహరించిన దేశం..


ఇద్దరు మహిళలు రాష్ట్రపతిగా ఉన్నారు..


ప్రతి సంవత్సరం కనీసం నాలుగు కోట్ల మంది పౌరులు

పేదరికం నుంచి బయటికి వచ్చి ఉన్నతమైన జీవితాన్ని గడిపే అవకాశం కల్పించే

ఆర్థిక రాజ్యం..


దేశీయంగా ఎన్నో వ్యతిరేక శక్తులు..అంతర్జాతీయంగా

అణచివేతకు ఎన్నెన్నో కుట్రలు..ఇంకెన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ

ఆర్థికంగా పురోగతిని సాధిస్తూ..నైతికంగా తనని తాను పటిష్టంగా మలచుకుంటూ..

ఎన్నో విషయాల్లో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తూ..విశ్వగురుగా

అవతరించిన 

ఉత్కృష్ట జాతి..



గొప్ప సంస్కృతి..

ఉన్నత సిద్ధాంతాలు..

అద్భుతమైన రాజ్యాంగం..

వీటన్నిటికీ ఆలవాలమైన దేశం..ప్రపంచ జనాభాలో

పదో వంతు ప్రజలు

ఓటు యజ్ఞంలో పాల్గొంటున్న 

శుభ వేళ ప్రపంచం మొత్తం ఇటే చూస్తుంది.ఇండియాలో జరిగే అతి గొప్ప క్రతువుని

ఎన్నో దేశాలు బూతద్దాలు

వేసుకుని పరిశీలిస్తాయి.

ఈ దేశం ఓ రోల్ మోడల్..

ప్రజాస్వామ్య దిక్సూచి..

ఇక్కడ ఎన్నికలు ఎంత గొప్పగా జరుగుతాయా అని ప్రపంచం ఎంతో ఆసక్తితో

గమనిస్తుంది.ఈ ప్రక్రియలో

వైఫల్యాలు చోటు చేసుకుంటే బాగుండు అని ఎదురుచూసే దేశాల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు.

అయినా ఇండియా గెలుస్తూనే ఉంది..


అయితే..మన దేశాన్ని..

మన జాతిని..

మన ప్రజాస్వామ్యాన్ని..

మన ఔన్నత్యాన్ని..

మన దేశంలో ఎంతో గొప్పగా జరిగే ఎన్నికల ప్రక్రియను

మరింత వైభోగంగా జరిపించుకోవాల్సిన బాధ్యత

ఈ దేశ పౌరులమైన మనందరిపైనా ఉంది..


ఓ నా దేశ గొప్ప పౌరులారా..

ఇంత మహోన్నత దేశంలో..

వైభవంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ గౌరవాన్ని

ఇనుమడింపచేయాల్సిన

బాధ్యత మనందరిపైనా

ఉంది..హింసకు తావు లేకుండా ఎన్నికలు జరుపుకుందాం.

ముఖ్యంగా ఓటును నోటుకు

అమ్మకుండా పౌరులుగా మన గౌరవాన్ని..

ప్రజాస్వామ్య మర్యాదను

కాపాడుకుని ప్రపంచంలో

మన విలువను పెంచుకుందాం..


జై హింద్..


🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు