హనుమకొండ: ఎన్నికలకు సంబంధించి ప్రజల నుండి ఏవైనా ఫిర్యాదులు అందినట్లయితే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మీడియా సెంటర్ తో పాటు ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, 1950, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్, సివిజిల్, ఎస్ ఎస్ టి, ఎఫ్ ఎస్ టి, వీడియో సర్వేలన్స్ టీం మానిటరింగ్ సెల్ లను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ బండారి స్వాగత్ రణ్వీర్ చంద్ మంగళవారం పరిశీలించారు.
ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటికి తీసుకున్న చర్యలు, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్, సి విజిల్ కు ఎలాంటి ఫిర్యాదులు అందాయి, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, వీఎస్టీ మానిటరింగ్ ఎలా జరుగుతుందనే వివరాలను సంబంధిత అధికారులు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ కు వివరించారు. ఆయా విభాగాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.
అదేవిధంగా మీడియా సెంటర్లో చేసిన ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఎంసీఎంసీ కి సంబంధించిన రికార్డులను వారు పరిశీలించారు. మీడియా సెంటర్ తో పాటు, కంట్రోల్ రూమ్ లో ఏర్పాటుచేసిన వివిధ విభాగాల పనితీరు బాగుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ వై.వి. గణేష్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ జి.వి. భాను ప్రసాద్, అధికారులు మధురిమ, కంట్రోల్ రూమ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box