కెమిస్ట్రీ విభాగంలో వసుధ మల్లం కు డాక్టరేట్

 


వరంగల్‌లోని CKM ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్  వరంగల్ కెమిస్ట్రీ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ వసుధ మల్లం కి డాక్టరేట్


వరంగల్‌లోని CKM ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్  కెమిస్ట్రీ విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ వసుధ మల్లం కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ కెమిస్ట్రీలో  పీహెచ్‌డీ డిగ్రీ ప్రదానం చేసినారు.  


 మాట్లాడుతూ, వసుధ మల్లం తన పిహెచ్‌డి థీసిస్‌ను "సింథసిస్ ఆఫ్ న్యూ ఫినోథియాజీన్ డెరివేటివ్స్ యాస్ పవర్ ఫుల్ యాంటీకాన్సర్ మరియు యాంటీ-సైకోటిక్ ఏజెంట్స్" అనే శీర్షికతో సమర్పించినట్లు కాకతీయ యూనివర్సిటీ kuc వరంగల్ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్. ఎస్. నర్సింహాచారి తెలిపారు.


వసుధ మల్లం  కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగపు ప్రొఫెసర్‌,  ప్రొ.జి. బ్రహ్మేశ్వరి పర్యవేక్షణలో తన పరిశోధన ను విజయ వంతంగా కొనసాగించారు.  క్యాన్సర్ మరియు ఫినోథియాజిన్ ఉత్పన్నాలపై AIIMS (వరల్డ్ క్యాన్సర్ కాంగ్రెస్ న్యూఢిల్లీ) వంటి అనేక జాతీయ & అంతర్జాతీయ సమావేశాలకు వసుధ పరిశోధనా పత్రాలను సమర్పించారు. వసుధ తన పరిశోధనా పత్రాలను (స్కోపస్) ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురించారు. ఆమె TS-SET పరీక్షలో కూడా అర్హత సాధించారు.


ఈ సందర్భంగా వైస్-ఛాన్సలర్, రిజిస్ట్రార్, కాకతీయ విశ్వవిద్యాలయం లోని ప్రముఖ ప్రొఫెసర్లు, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్‌లు వసుధకు పిహెచ్‌డి అవార్డు లభించడంతో వసుధ మల్లం నీ  మరియు ప్రొఫెసర్  జి. బ్రహ్మేశ్వరి గారిని శుభాకాంక్షలతో అభినందించారు.

.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు