బిఆర్ఎస్ పార్టి 8 నుండి 12 ఎంపీ స్థానాలు గెలవ బోతోెంది - ఓర్వ లేకే బిజెపి కాంగ్రేస్ కెసిఆర్ పై కుట్రలు -ప్రెస్ మీట్ లో కెటిఆర్


 బస్సుయాత్రతో జనాలలో వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేక ప్రదాన మంత్రి నరేంద్ర మోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెసిఆర్ పై పన్నాగం పన్నారని బిఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు.

కెసిఆర్ రైతులు, నేతన్నల పక్షాన ప్రశ్నించినందుకు ఆయన ప్రచారం చేయుకండా  ఎలక్షన్ కమీషన్ కేసు నమోదు చేసి 48 గంటల పాటు నిషేదం విధించడం పట్ల కెటిఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమ పార్టి నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రేస్ నేతలకు సంభందించిన అనేక ఆధారాలతో ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదులు చేసినా ఇంత వరకు చర్యలు లేవన్నారు.

 తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ప‌రుష ప‌దజాలం మీద ఎన్నిక‌ల సంఘానికి 8 ఫిర్యాదులు ఇచ్చామని కాని చ‌ర్య‌లు లేవని అన్నారు. కేసీఆర్‌ను ఉరితీస్తాం.. పేగులు తీస్తాం..గుడ్లు ఊడపీకుతాం.. లాగుల తొండ‌లు వ‌దులుతాం.. ముడ్డి మీద డ్రాయ‌ర్ కూడా ఊడపీకుతాం.. కేసీఆర్ త‌ల న‌ర‌కండి.. కేసీఆర్ త‌ల తెగ్గోయండి అని రేవంత్ రెడ్డి మాట్లాడాడని  ఈ మాట‌లు ఎన్నిక‌ల సంఘానికి నీతిసూక్తులు, సుభాషితాల్లాగా వినబ‌డుతున్న‌ాయని కెటిఆర్ అన్నారు. 


బ‌డా భాయ్.. చోటా భాయ్ క‌న్నుస‌న్న‌ల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ని చేస్తోందని కెటిఆర్ ఆరోపించారు. తామిచ్చిన‌ 27 ఫిర్యాదుల‌పై స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ మీద 8, మ‌రో 19 ఫిర్యాదులు మిగ‌తా పార్టీ నాయ‌కులపై ఉన్నాయని కొండా సురేఖ‌కు మంద‌లింపుతో వదిలేశారని కాని ప్ర‌చారాన్ని నిషేధించ‌లేదని అన్నారు. కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభించ‌గానే కాంగ్రెస్‌కు, బీజేపీకి ద‌డ పుట్టిందన్నారు. స్టేట్‌లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్, కేంద్రంలో ఐబీ రిపోర్టు ఎప్ప‌టిక‌ప్పుడు ఇస్తున్నాయని, కేసీఆర్ బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారని  మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని ఆ పార్టీల‌కు కంట‌గింపుగా మారిందని  2014లో బ‌డా భాయ్ చేసిన మోసం, 2023లో చోటా భాయ్ చేసిన మోసాన్ని పూస‌గుచ్చిన‌ట్టు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తుంటే.. త‌ట్టుకోలేక ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకు ఇద్దరూ కల్సి పన్నిన పన్నాగమన్నారు.


బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడ గెలవలేదని అన్నోళ్లు ఇప్పుడు కెసిఆర్ బస్సు యాత్ర చూసి భయపడుతున్నారని అన్నారు. తమ పార్టీ 8 నుమడి 12 సీట్లు గెలవబోతున్నదని అన్నారు.

ఎలక్షన్ కమీషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కెటిఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రులు దేవుళ్ల ఫోటోలు ప్రదరర్శిస్తూ ఎన్నికల ప్రచారాలు చేసినా చర్యలు లేవన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు, అమిత్ షా ఇతర నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు