సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ

 

కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు
ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో 17న బ్రెయిన్ సర్జరీ జరిగిందన్న ఇషా ఫౌండేషన్
పత్రికా ప్రకటన విడుదల చేసిన ఇషా ఫౌండేషన్
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని బాగా కోలుకున్నాడని ప్రకటన



బ్రెయిన్ లో తీవ్ర రక్త స్రావంతో భాదపడుతున్న  ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఈ రోజు సాయంత్రం సద్గురు బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. 


గత నాలుగు వారాలుగా, సద్గురు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, మహాశివరాత్రితో సహా విశ్రాంతి లేకుండా పని చేస్తున్నట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. మార్చి 15న ఆయనకు ఎంఆర్ఐ పరీక్షలు చేయగా మెదడులో భారీ రక్తస్రావం కనిపించిందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ తన బిజీ షెడ్యూల్‌లో భాగంగా ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ను వాయిదా వేసుకోవడానికి నిరాకరించారని తెలిపారు. పవన్‌ఫుల్ పెయిన్ కిల్లర్స్‌ను ఉపయోగించి ఆ కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పారు.


17వ తేదీ ఉదయం సద్గురును ఆసుపత్రికి తీసుకువచ్చారని, ఆయన మెదడులో ప్రాణాంతక వాపును గుర్తించినట్లు డాక్టర్ తెలిపారు. 17న అత్యవసర శస్త్రచికిత్స చేశామని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన బాగా కోలుకుంటున్నట్లు చెప్పారు. 


మేం చేయగలిగింది చేశాం కానీ మీ మనోధైర్యంతో మీకు మీరే నయం చేసుకుంటున్నారని ఆయనతో సరదాగా అన్నామని డాక్టర్ వినీత్ సూరి తెలిపారు. సద్గురు మేం ఊహించినదాని కంటే వేగంగా కోలుకుంటున్నారని, చాలా బాగా ఉన్నాడని, మెదడు, శరీరం, ఇతర అవయవాల్లో వేగవంతమైన స్థిరమైన కనిపిస్తోందన్నారు.


 వైద్యులు తన పుర్రె కోసి ఓపెన్ చేసి చూశారని అయితే వారు ఏమి కనుక్కోలేక పోయారని అది ఖాళీగా ఉందంటూ సద్గురు జగ్గీ వాసుదేవ్ జోక్ చేసిన వీడియో ఇస్టాలో పోస్టు చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు