బి.సి వాటా సాధనకోసం ఎర్రకోటను ముట్టడిస్తాం


 చట్టసభల్లో బి.సి వాటా సాధనకై ఎర్రకోటను ముట్టడిస్తాం
బి.సి సంఘాల పిలుపు
చట్టసభల్లో బి.సి వాటా కోసం 400 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి 
పార్లమెంటు ఎన్నికల తర్వాత యాత్ర పునఃప్రారంభం 


    చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం భారతదేశ నలుమూలల ప్రజలతో ఢిల్లీ ఎర్రకోటను ముట్టడించాలని బి.సి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. చట్టసభల్లో వాటా సాధన కోసం మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మిరుగోన్ పల్లి గ్రామం వీరుడు పండుగ సాయన్న వద్ద ఈనెల ఒకటిన మొదలైన బి.సి మహా పాదయాత్ర బుధవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ సర్దార్ సర్వాయి పాపన్న ఖిలాలో జరిగిన విరామ సభలో వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. పాదయాత్రకు నాయకత్వం వహించిన ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్, హిందూ బి.సి మహాసభ వ్యవస్థాపక అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ లు మాట్లాడుతూ సకల సామాజిక రంగాల్లో బి.సి లకు రావాల్సిన న్యాయమైన వాటా సాధన ఉద్యమంలో బాగంగా చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం 20 రోజుల పాటు 400 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసామని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎండల్లో బి.సి వీరులను స్మరిస్తూ వారి స్థలాలను సందర్శించి వేలాది ప్రజలతో మమేకమై పాదయాత్ర కొనసాగించామని పార్లమెంటు ఎన్నికల రీత్యా పాదయాత్రకు విరామం ఇచ్చామని ఎన్నికల తర్వాత ఈ యాత్రను ఇదే సర్వాయి పాపన్న ఖిలాషాపూర్ నుండి పునఃప్రారంభం చేసి లాల్ ఖిలా వరకు కొనసాగించి లక్షలాది ప్రజలను కదిలించి చట్టసభల్లో బి.సి ల వాటా సాధిస్తామని అన్నారు. 

   వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బి.సి ల సమస్య ఏ ఒక్క రాష్ట్ర సమస్య కాదని ఈ దేశ సమస్య అని అలాంటి సమస్య పరిష్కారం కోసం దేశవ్యాప్త ఉద్యమం చేయాలని ఆ ఉద్యమానికి తెలంగాణలో రాచేసిన ఉద్యమం అంటుకొని దేశంలోని ఆధిపత్యవర్గ పాలకులను కట్టడి చేస్తుందని అన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఉద్యమానికి ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా సహాయం చేయాలని, ముఖ్యంగా ఎదిగిన బి.సి లు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో వాటా కోసం ప్రజాస్వామ్యబద్ధంగా మొదలైన ఈ ఉదమాన్ని ఈ దేశ పాలకులు గౌరవించి, అర్థం చేసుకొని చట్టసభల్లో వాటా ఇవ్వాలని లేదంటే ఆధిపత్య పార్టీలను, వారి కార్యాలయాలను, వారి ఇళ్లను, అసెంబ్లీ, పార్లమెంటులను ముట్టడిస్తామని అన్నారు. ఈ విరామ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్నూరు కాపు సంక్షేమ సంఘం అద్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం బి.సి మహా పాదయాత్ర సైనికులకు మేమెంటోలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు.



    ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వెలుగు వనిత, ఏటిగడ్డ అరుణ, దిడ్డి విష్ణుమూర్తి, నాయకులు గిరగాని బిక్షపతి గౌడ్, ఎర్ర శ్రీహరి గౌడ్, బొల్లం లింగమూర్తి, పర్వత సతీష్, చాపర్తి కుమార్ గాడ్గే, సింగారపు అరుణ, గడిపె విమల, మొగిలి బాలస్వామి, ఎర్రమల్ల శ్రీనివాస్, అజయ్ పటేల్, అనంతుల రాంప్రసాద్, కొంగర నరహరి, సుజాత, సూరారపు రమాదేవి, విశ్వపతి, బత్తుల రాంనర్సయ్య, చింతలగారి వెంకటస్వామి,  న్యాయవాదులు లక్షిదేవి, కూనూరు రంజిత్ గౌడ్, పంగ బుచ్చిబాబు, వేంపటి దేవమ్మ, వెలుగు వెన్నెల, ఇంజమూరి శాంత, చెన్న శ్రావణ్ కుమార్, కుంట విజయ్ కుమార్, దుబ్బకోటి ఆంజనేయులు, కొత్త వినయ్ బాబు, పంతుల మల్లయ్య, కలాల్ నర్సింహులు గౌడ్, వీరమని, మహేష్, సంగెం స్వరూప,  తాటికొండ సద్గుణ, కాల్వ మధుబాబు, తాడిచర్ల రమేష్, ఆది సంజీవ, బొల్లికొండ సుదర్శన్, బత్తుల వసంత, పంతుల మనెమ్మ, బత్తుల రజిత, ఆది సరిత, దుబ్బకోటి సబిత, ఎడవెళ్లి పద్మ, సాధు పెద్ద కృష్ణ, పిట్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

    ఈ కార్యక్రమంలో విముక్త చిరుతల కక్షి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్, రఘునాథపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మేకల వరలక్ష్మి, రఘునాథపల్లి మాజీ జెడ్పీటీసీ రాంబాబు, మున్నూరు కాపు సంక్షేమ సంఘం సర్దార్ పుట్టం పురుషోత్తం, ఖిలాషాపురం సర్పంచ్ శ్రీధర్ గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు పాలడుగు శ్రీనివాస్, అశోక్ యాదవ్, ఎలిషాల దత్తాత్రేయ, బి.సి జనసభ వ్యవస్థాపక అధ్యక్షులు రాజారాం యాదవ్, బి.సి కులాల ఐక్య వేదిక, రాష్ట్ర నాయకులు బనుక సిద్దిరాజ్ యాదవ్, బహుజన సేన రాష్ట్ర అద్యక్షులు వాసు కె యాదవ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెరిక సంఘం ప్రధాన కార్యదర్శి పూజారి వెంకటేశ్వర్లు, ఆర్ టి సి బి.సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, బి.సి కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు మహేష్ గౌడ్, ఆల్ ఇండియా ఒబిసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, సర్వాయి పాపన్న సేన నాయకులు పంజాల శ్రావణ్ కుమార్, న్యాయవాదులు సత్యనారాయణ రెడ్డి, ఎగ్గడి సుందర్ రామ్, బి.సి యునైటెడ్ ఫ్రంట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాలూరు రామకృష్ణ, నవసంఘర్షన సమితి అధ్యక్షుడు పంజాల జైహింద్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి రాష్ట్ర మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, చెరిగల్ సర్పంచ్ సారంగపాని, కోదాడ పి ఎ సి ఎస్ ఛైర్మన్ ఆవుల రామారావు, ఖిలాఘన్పూర్ సర్పంచ్ కె వెంకటరమణ, ఎం.బి.సి వాణి ఎడిటర్ బెక్కం వెంకట్, సంచారజాతుల జాక్ నాయకులు పాండు వంశరాజుల, వివిధ  నాయకులు గుమ్మడి రాజుల సాంబన్న, కమ్మగాని వెంకటేష్, మేకల నరేందర్  తదితరులు పాల్గొని మాట్లాడారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు