హన్మకొండ ఆర్డీవో పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

 


ఫోన్ కాల్స్ రికార్డు చేసి ఇతరులకు సర్కులేట్ చేసాడని మంత్రి ఆరోపణ 

అర్డీవో పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

చర్యతీసుకోవాలని చీఫ్ సెక్రెటరీ శాంతికుమారికి ఫిర్యాదు


తన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు సర్కులేట్ చేస్తున్నాడని హన్మకొండ ఆర్డీవో పై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి బుధవారం ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసి ఇతరులకు పంపిస్తున్న  ఆర్డీవోపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

కళ్యాణ లక్ష్మికి సంభందించిన చెక్కులు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేత పంపిణి చేయించవద్దంటూ ఆర్డీవోతో మాట్లాడిన కాల్ లీక్ అయింది. ఆర్డీవో కాల్  రికార్డు చేసి పాడి కౌశిక్ రెడ్డికి పంపించారని  ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో మంత్రి కాల్ వైరల్ అయింది. దాంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేసారు. ఈ ఆడియో లీక్ హన్మకొండ ఆర్డివో ద్వారే జరిగిందని ఆయనపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఫిర్యాదులో కోరారు.

 గతంలో కళ్యాణ లక్ష్మికి చెందిన చెక్కులు అపోజిషన్ లో ఉన్న వారితో పంపిణి చేయించారని  ఇప్పుడు కూడ పంపిణి చేయించాల్సిన అవసరం లేదని  ఎట్టి పరిస్థితులోనూ ఎమ్మెల్యే చేతికి అంద కూడదని తహశీల్ దార్లకు పూర్తి స్వేచ్చ నిస్తున్నామని స్థానిక సర్పంచులతో నైనా పంపిణి చేయించాలని మంత్రి ఆర్డివోను ఫోన్ కాల్ లో ఆదేశించినట్లు ఆడియో లీక్ అయింది.

 గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కరవు వచ్చిందని బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పంట నష్టంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.


ఉచిత బస్సులలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో  30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోక్ సభ స్థానాల్లో పోటి తీవ్రంగా ఉందన్నారు. బండి సంజయ్‌‌ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ అవినీతిపరుడని తెలంగాణ రాష్ట్రం కోడై కూస్తోందని.. దానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు.


కిషన్ రెడ్డి‌ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కేసీఆర్ అపాయింట్ చేయించారని ఆరోపించారు. ఆ విషయం కూడా బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయారని విమర్శించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, బండి సంజయ్‌లు ఇద్దరూ లోపాయకారీగా మిత్రులని తీవ్ర ఆరోపణలు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు