డిసిపి పై పోలీస్ స్టేషన్ లో జర్నలిస్టుల ఫిర్యాదు

 


వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి మహమ్మద్ భారీ పై ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు.


ఎస్ ఎన్ ఎం క్లబ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పలు మంత్రుల కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులపై పరుష పదజాలంతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి భారీ పై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు,పలు జర్నలిస్టుల సంఘాల నాయకులు సీపీకి ఫిర్యాదు చేశారు.


 వరంగల్ నుండి హనుమకొండ ప్రెస్ క్లబ్ కి భారీగా తరలివెళ్ళిన తూర్పు జర్నలిస్ట్ లు,ప్రెస్ క్లబ్ సభ్యులు, నల్ల బ్యాడ్జిలతో డిసిపి భారీ కి వ్యతిరేకంగా జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు 


 వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి 250 మంది జర్నలిస్టులతో కలిసి ర్యాలీగా తరలి వెళ్లి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకుని డిసిపి భారీపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ బాధ్యులు, వివిధ సంఘాల యూనియన్ నాయకులు ,పలు జర్నలిస్టులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కి మెమోరాండం అందజేశారు. ఈ విషయంపై స్పందించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా యూనియన్ నాయకులు పలు జర్నలిస్టు బృందాలతో కలిసి చర్చలు జరపగా సరిగా స్పందించకపోవడంతో..   జర్నలిస్టు నాయకులు సంతృప్తి చెందక సెంట్రల్ జోన్ డిసిపి భారీపై ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో డిసిపి భారీపై విడివిడిగా ముగ్గురు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.


ఈ కార్యక్రమంలో T.U.W.J(I.J.U) అధ్యక్ష కార్యదర్శులు శ్రీ రామ్ రామచందర్,మట్టా దుర్గా ప్రసాద్,యూనియన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు మిద్దెల రంగనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాడి పెల్లి మధు, I.J.U హన్మకొండ జిల్లా ప్రధనకార్యదర్శి తోట సుధాకర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకనాల సంతోష్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ ఆడేపు సాగర్ T.U.W.J (143) రాష్ట్ర ఉపాధ్యక్షులు B.R. లెనిన్,జిల్లా అధ్యక్షుడు కక్కర్ల అనిల్,మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పిన్నా శివకుమార్, గడ్డం కేశవమూర్తి,తుమ్మ శ్రీధర్ రెడ్డి ,ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాదికారి  బోళ్ళ అమర్,  ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కృష్ణ మోహన్, పెద్దిష్ , ప్రెస్ క్లబ్ కమిటీ బాధ్యులు బొడిగే శ్రీనివాస్,గొకారపు శ్యామ్, అల్లం రాజేష్ వర్మ,వలిషెట్టి సుధాకర్, పెద్దపల్లి వరప్రసాద్, ఎండీ.నయీం,వేణు గోపాల్,శ్రీకాంత్, వరంగల్ తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం అధ్యక్ష,కార్యదర్శులు కొరుకొప్పుల నరేందర్, బండి రవి, త్రినగరి జర్నలిస్ట్ సంఘాల నాయకులు,జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు