పాలకుర్తి చేరిన బి.సి నేతల పాదయాత్ర

 


చాకలి ఐలమ్మ స్పూర్తితో చట్టసభల్లో బిసి వాటా సాధిద్ధాం


 ఆల్ ఇండియా ఒబిసి జాక్ పిలుపు


ఖిళాషాపూర్ కోట నుండి లాల్ ఖిలా వరకు కదం తొక్కుధాం


హిందు బిసి మహాసభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు 


సగానికి ఎక్కువ  జనాభా గల వారికి సమాన వాటా రావాలి. 


 తెలంగాణ బిసి సంక్షేమ సంఘము అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్


 పాలకుర్తిలో ఘనంగా స్వాగతం పలికిన బి.సి నాయకులు


 


 చట్టసభల్లో బి.సి ల వాటా సాధన లక్ష్యంతో సబ్బండ బి.సి కులాల సమూహం ఆల్ ఇండియా ఒబిసి జాక్, హిందూ బి.సి మహాసభ, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం ఆధ్వర్యలో గత 18 రోజులుగా బి.సి మాహా పాదయాత్ర చేస్తున్న బృందం సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్న పాదయాత్రకు మండలంలోని బహుజన సంఘాల నేతలు ఘన స్వాగతం పలికి పూలమాలతో చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. కమ్మగాని వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన స్వాగత సభలో  ఆల్ ఇండియా ఓబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు జాక్ వైస్ చైర్మన్లు వెలుగు వనిత, పటేల్ వనజ, ఏటిగడ్డ అరుణ, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు. ఉత్పత్తిలో సగానికి ఎక్కువ భాగంలో బీసీలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆర్థికంగ, హార్దిక భాగస్వామ్యం అందిస్తున్నప్పటికీ పరిపాలన వ్యవస్థలో చట్టసభలలో బీసీలకు సముచిత స్థానం కల్పించడంలో ఇన్నేళ్లలో పాలకులంతా విఫలమయ్యారని దుయ్యబట్టారు. కాకా ఖలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ లను తుంగలో తొక్కిన పాలకులు ఆధిపత్య కులాలకు మేలు చేసే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించుకోవడంలో  చిత్తశుద్ధితో పనిచేశారని, తద్వారా నూటికి 65 శాతం పైగా ఉన్న బీసీలకు అపారమైన నష్టం వాటిల్లుతుందని వారు ఆరోపించారు. బీసీ జనాభాను అన్ని పార్టీలు బి.సి లను ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకుంటున్నాయి తప్ప బీసీలను పాలకులుగా గుర్తించడంలో అగ్రవర్ణ రాజకీయ పార్టీల నాయకులు అన్ని ఆచరణలో బీసీ వ్యతిరేకమైనవేనని వారు విమర్శించారు.

    చట్ట చట్టసభల్లో బీసీ వాటా సాధించేందుకు పండుగ సాయన్న మొదలుకొని చాకలి ఐలమ్మ, షేక్ బందగి, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య లాంటి అనేకమంది అమరుల స్ఫూర్తితో చట్టసభల్లో వాటా సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు జెండాలు మోసిన బి.సి లు  ఇకనైనా మేల్కొని మన రాజ్యం కోసం పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటికైనా బీసీ సమాజం అగ్రవర్ణ రాజకీయ పార్టీల జెండాలను వదిలేసి మహోదృతంగా సాగుతున్న చట్టసభల్లో బీసీ వాటా ఉద్యమంలో పార్టీలు, సంఘాలు, కులాలకు అతీతంగా భాగస్వాములు కావాలని, మహిళా బిల్లులో బి.సి మహిళల కోట కల్పించినప్పుడే మహిళల హక్కులు కూడా కాపాడబడుతాయని అన్నారు.

  ఈ పాదయాత్ర బృందంలో గిరగాని బిక్షపతి, కొంగర నరహరి, సుజాత, విశ్వపథి, గడిపె విమల, మొగిలి బాలస్వామి, అజయ్ పటేల్, సూరారపు రమాదేవి, అనంతుల రాంప్రసాద్, సింగారపు అరుణ, ఏర్రమల్ల శ్రీనివాస్, చెన్న శ్రావణ్ కుమార్, కుంట విజయ్ కుమార్, నర్సింహుల గౌడ్, మహేష్, వీరమని, బొల్లికొండ సుదర్శన్ తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీలు భూమా రంగయ్య, కమ్మగాని పరమేశ్వర్, మూల వెంకటేశ్వర్లు, గుమ్మడి రాజుల సాంబయ్య, కొనకటి కళింగ రాజు, పులి గణేష్, సంఘి వెంకన్న, ఏదునూరి మదర్, పోలాస సోమన్న తదితరులు పాదయాత్రకు స్వాగతం పలికి పాదయాత్ర బృందానికి తువ్వాలుతో సత్కరించి సంఘీభావాన్ని ప్రకటించి ఊరు చివరవరకు పాదయాత్రలో బాగమైనారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు