కడవెండి కి చేరిన బి సి పాదయాత్ర

 


మహావీరుల స్పూర్తితో చట్టసభల్లో బి.సి ల వాటా సాదిద్ధాం..... 


ఆల్ ఇండియా ఒబిసి జాక్ నాయకుల పిలుపు.....


320 కిలో మీటర్లు పూర్తి చేసి కడవెండి కి చేరిన బి సి పాదయాత్ర....


     పీడిత ప్రజల విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగపూరిత ఉద్యమాలు చేసిన నల్ల నర్సింహులు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగి, మారోజు వీరన్న లాంటి మాహావీరుల స్పూర్తితో చట్టసభల్లో బిసి వాటా సాధించాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్లు పటేల్ వనజక్క, వెలుగు వనితక్క, హిందూ బిసి మహాసభ అద్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, తెలంగాణ బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ లు పిలుపునిచ్చారు. చట్టసభల్లో బి.సి వాటా కోసం ఈ నెల ఒకటిన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం మిరిగోన్ పల్లి వీరుడు పండుగ సాయన్న గ్రామంలో ప్రారంభమైన బి.సి మహాయాత్ర 17వ రోజు 320 కిలో మీటర్లు పూర్తి చేసుకొని ఆదివారం జనగామ జిల్లా దేవురుప్పుల మండలం కడవెండి కి చేరుకున్న సందర్భంగా దొడ్డి కొమురయ్య, నల్ల నరసింహులు, స్థూపాల దగ్గర నివాళులు అర్పించి మాట్లాడారు. ఆనాటి నిరంకుశ పాలనకు ఎదురుంచి పోరాడిన ధీరులు నల్ల నరసింహులు, దొడ్డి కొమురయ్య ల స్పూర్తితో చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం జరిగే పోరులో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20న రగునాధపల్లి మండలం సర్థార్ సర్వాయి పాపన్న స్వస్థలం ఖిలాశాపురంలో సాయంత్రం జరుగు ముగింపు పాదయాత్రకు వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.  మహాత్మా జ్యోతి రావు పూలే నుండి కాన్షీరాం వరకు ఎంతోమంది మహనీయులు బి.సి ల కోసం పోరాడారని, కాకాకలెల్కర్ కమీషన్, మండల్ కమీషన్ లాంటివి ఎన్నో నివేదికలు, సిపారులు వచ్చినా అవి అమలుకు నోచుకోక బి.సి లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. పాదయాత్రకు గ్రామ గ్రామాన ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, వీరుల కన్న కడవెండి ప్రజల స్పూర్తితో భారతదేశంలోని బి.సి లను ఐక్యం చేసి చట్టసభల్లో బి.సి వాటా, మహిళ బిల్లులో బి.సి కోటా సాధిస్తామని అన్నారు. దేశంలో జరిగిన అన్ని పోరాటాల్లో పాల్గొని త్యాగాలు చేసిన బి.సి లు నేడు బి సి విముక్తి కోసం జరిగే పోరులో ముందుండాలని పిలుపునిచ్చారు.    నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి పోరాడిన వీరుడు నల్ల నరసింహులు కూతురు నల్ల అరుణ, దొడ్డి కొమురయ్య వారసుడు దొడ్డి బిక్షపతి లు పాదయాత్ర కు సంఘీ భావంగా మాట్లాడారు. మీరు చేస్తున్న న్యాయమైన పోరాటానికి అండగా ఉంటామని అన్నారు. పాదయాత్రకు సంఘీభావం తెలుపడానికి వరంగల్ నుండి వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్, ఉద్యమ నాయకులు సోమ రామమూర్తి, సూరం నిరంజన్, గోధుమలు కుమారస్వామి, సామాజిక సేవకురాలు దిడ్డి ధనలక్ష్మి, హైదరాబాద్ నుండి వచ్చిన తిప్పని ముకుంద, నాగమణి సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో బాగమైనారు. తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అద్యక్షులు గిరగాని క్రాంతి గౌడ్ పాదయాత్రికులను శాలువాలతో సత్కరించారు.  

   ఈ పాదయాత్ర బృందంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ ఛైర్మన్ ఏటిగడ్డ అరుణ పటేల్ నాయకులు ఎర్ర శ్రీహరి గౌడ్, గిరగాని బిక్షపతి గౌడ్, పర్వత సతీష్, చాపర్తి కుమార్ గాడ్గే, సూరారపు రమాదేవి  కొంగర నరహరి, సుజాత, మొగిలి బాలస్వామి, గడిపె విమల, ఎర్రమల్ల శ్రీనివాస్, బత్తుల రామనర్సయ్య, విశ్వపతి, పెంట అజయ్ పటేల్, కుంట విజయ్ కుమార్, అనంతుల రాంప్రసాద్, దుబ్బకోటి ఆంజనేయులు, సింగారపు అరుణ, చెన్న శ్రావణ్ కుమార్, బోల్లికొండ సుదర్శన్ గౌడ్, ఆది సంజీవ తదితరులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో కడవెండి మాజీ సర్పంచ్ సుడిగెల హనుమంతు యాదవ్, తాటిపెళ్లి మహేష్, కాశబోయిన నగేష్, బెల్లి సోమయ్య, పంతం సోమయ్య, పెద్ది సత్యనారాయణ, కాశబోయిన మల్లేష్, నల్ల వీరస్వామి, అసనాల మల్లాజీ,పైండ్ల బాల్ నర్సు, వరికెల రతన్, బత్తుల సత్తయ్య, మామిడాల మదార్, పైండ్ల రవి, కామునిపెళ్లి నరసింహాచారి, ఆవుల రాములు, మైనాల చంద్రయ్య, మారుసాని కొండయ్య, బనారి మైసరావు, రేషపల్లి కృష్ణమూర్తి, పైండ్ల వెంకటరమణ, ధరగాని మైసరావు, ఇంగె నరసయ్య, కాశబోయిన కేశయ్య, కందుల నర్సయ్య, తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు