మావాట మాగ్గావాలే-ఖిలాశాపూర్ టు లాల్ ఖిలా

 

చట్టసభల్లో బి.సి వాటా సాధనకు 
ఖిలాశాపూర్ టు లాల్ ఖిలా 


   స్వాతంత్రం ముందు నుండి ఎంతో శ్రమచేసి, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన బి.సి సమాజానికి అటు రాజ్యం లేక ఇటు రాజ్యాంగ హక్కులు లేక బతుకులీడుస్తూ బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు, జాక్ వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వెలుగు వనితలు అన్నారు. చట్టసభల్లో వాట సాధన కోసం ఈ నెల ఒకటిన ప్రారంభమైన బి.సి మాహా పాదయాత్ర బృందం 15 వ రోజు 284 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకొని సూర్యాపేట జిల్లా నాగారం మండలం కేంద్రంతో పాటు పనిగిరి, ఈటూరు గ్రామాల్లో ప్రచారం చేసి మాట్లాడారు.

 


 సకల సామాజిక రంగాల్లో సమన్యాయం జరగాలంటే బి.సి లకు చట్టసభల్లో సమాన వాటా దక్కిననాడే సాధ్యమవుతుందని అన్నారు. చట్టసభల్లో బి.సి వాట సాధన కోసం బి.సి వీరుల స్పూర్తితో తెలంగాణలో మార్చి ఒకటిన మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైన మొదటి దశ మహా పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఈ నెల 20 న మహావీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న ఉద్యమ ఖిల్లా ఖిలాషాపూర్ లో ముగుస్తుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మొదలయ్యే రెండవ దశ బి.సి దండయాత్ర ఖిలాషాపూర్ టు ఢిల్లీ లాల్ ఖిలా వరకు కొనసాగుతుందని అన్నారు. దేశంలో జరిగిన అన్ని ఉద్యమాల్లో ఎన్నో త్యాగాలు చేసి అసువులు బాసిన చరిత్ర కలిగిన బి.సి లు నేడు బి.సి ల కోసం జరిగే యుద్ధంలో ముందుండాలని పిలుపునిచ్చారు. 

   మహాత్మా జ్యోతరావు పూలే నుండి మారోజు వీరన్న వరకు బి.సి ల విముక్తికోసం ఎన్నో హక్కులు సాధించారని, మండల్ కమీషన్ ద్వారా బి.సి లకు లభించిన రిజర్వేషన్లను కొల్లగొట్టడం కోసం ప్రైవేటీకరణ తీసుకొచ్చారని, అంతంత మాత్రంగా అమలవుతున్న విద్యా రిజర్వేషన్లకు క్రిమిలేయర్ తో అడ్డుకట్ట వేశారని, ఆదిపత్య వర్గాల పేదల పేరుతో రాత్రికి రాత్రే ఇబిసి చట్టం తీసుకొచ్చి బి.సి లకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. మహిళా బిల్లులో బి.సి కోటా లేకుండా చేసిన బిజెపి రాజకీయంగా బి.సి పురుషులను, మహిళలను ఎదగకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంలో జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సముచిత స్థానం ఉన్నప్పుడే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. చట్టసభల్లో బి.సి వాటా సాధించి బి.సి ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించి అమలుపరచిననాడే దేశంలో సమసమాజం స్థాపన జరుగుతుందని అన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన చట్టసభల్లో వాటా కోసం దేశంలోనే మొదటిసారిగా పాదయాత్ర మొదలుపెట్టామని అన్నారు. ఈ పాదయాత్రతో పాటు భవిషత్ లో జరిగే బి.సి ఉద్యమాలకు బి.సి ప్రజలు, మేధావులు, విద్యార్థులు, మహిళలు, సామాజిక, ప్రగతిశీలవాదులు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. 

   ఈ పాదయాత్ర బృందంలో ఎర్ర శ్రీహరి గౌడ్, గిరగాని బిక్షపతి గౌడ్, అజయ్ పటేల్, చాపర్తి కుమార్ గాడ్గే, సూరారపు రమారెడ్డి, చింతలగారి వెంకటస్వామి, పర్వత సతీష్, బాలస్వామి, గడిపె విమల, ఎర్రమల్ల శ్రీను, చెన్న శ్రావణ్ కుమార్, అనంతుల రాంప్రసాద్, కొంగర సుజాత, విశ్వపతి, సుదర్శన్, శ్రీకాంత్ గౌడ్, జలగం సుగుణ, వెంపటి దేవమ్మ, శాంత, సోమమ్మ, ఎడవెల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. 

    ఈ పాదయాత్ర బృందానికి నాగారం గ్రామానికి చెందిన కన్నెబోయిన అంజయ్య యాదవ్ దంపతులు  రాత్రి ఆశ్రయం కల్పించి భోజనం ఏర్పాటు చేసి ఉదయం జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఫనిగిరికి చెందిన గట్టు పెద్ద సత్తయ్య దంపతులు అల్పాహారం అందించి సహకారం అందించారు. ఈటూరు గ్రామానికి చెందిన పేరాల వెంకన్న బోజనం ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించారు. ఈ కార్యక్రమానికి కన్నేబోయిన వెంకటయ్య, కన్నెబోయిన రామ్మూర్తి, బయ్య వెంకన్న, జి.సురేష్, పత్తేపురం యాదగిరి తదితరులు మద్దతు పలికారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు