మారోజు వీరన్న స్వస్థలం చేరిన బి.సి జాక్ నేతల పాదయాత్ర

 


మారోజు వీరన్న మాట చట్టసభలకు బి.సి బాట


వీరుడు కా. మారోజు వీరన్న స్పూర్తితో బి.సి వాటా సాధిద్ధాం


170 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసి కరివిరాల కొత్తగూడెం చేరిన బి.సి మహా పాదయాత్ర


     కుల, వర్గ నిర్మూలన పోరాట యోధుడు, మలిదశ తెలంగాణ ఉద్యమ ఆరంభుకుడు, తెలంగాణ మహాసభ, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు, సామాజికన్యాయ పోరాట పితామహుడు కామ్రేడ్ మారోజు వీరన్న స్పూర్తితో చట్టసభల్లో బి.సి లకు వాటా సాధిద్దామని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్లు వెలుగు వనిత, పటేల్ వనజ, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు పిలుపునిచ్చారు. చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం ఈ నెల ఒకటిన మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైన మహా పాదయాత్ర 170 కిలోమీటర్లు పూర్తి చేసుకొని గురువారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి మీదుగా మారోజు వీరన్న జన్మస్థలం కరవిరాల కొత్తగూడెం చేరుకొంది. వీరన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. 



    సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం అన్ని రకాల అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిన మారోజు వీరన్న ఆశయాల స్పూర్తితో చట్టసభల్లో బి.సి వాటా సాధిస్తామని అన్నారు. తరతరాలుగా ఆధిపత్య వర్గాల అణచివేతకు గురై చెల్లాచెదురైన బి.సి సమాజాన్ని చైతన్యపరిచి ఐక్యం చేయడం కోసమే పండుగ సాయన్న ముదిరాజ్ నుండి సర్దార్ సర్వాయి పాపన్న వరకు 400 కిలోమీటర్ల మొదటి దశ పాదయాత్రను చేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ బి.సి దండ యాత్ర ఖిళాశాపూర్ నుండి డిల్లీ లాల్ ఖిలా కొనసాగుతుందని అన్నారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల, అన్ని సంస్థలలోని బి.సి లు, ఇతర ప్రగతిశీల సంఘాలు ఈ ఉద్యమంలో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలలో కీలకపాత్ర పోషిస్తూ ఓట్లు వేయించే రెండవ స్థాయి నాయకులుగా కొనసాగుతున్న బి.సి లు వారికి జరుగుతున్న అన్యాయాలను గుర్తించలేకపోతున్నారని, మహిళా బిల్లులో బి.సి కోటా లేకుండా, ఇబిసి రిజర్వేషన్ల వల్ల, క్రిమిలేయర్ వల్ల బి.సి లకు ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు. బి.సి ల అభివృద్ధి జరగాలంటే చట్టసభల్లో వాటా ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. 

   ఈ పాదయాత్ర బృందంలో జాక్ వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వెలుగు వనిత, ఏటిగడ్డ అరుణ పటేల్, నాయకులు సింగారపు అరుణ, సూరారపు రమారెడ్డి, గడిపె విమల, బాలస్వామి, ఎర్రమల్ల శ్రీను, బుచ్చిబాబు, చెన్న శ్రావణ్ కుమార్, ఎర్ర శ్రీహరి గౌడ్, గిరగాని బిక్షపతి గౌడ్, అజయ్ పటేల్, చాపర్తి కుమార్ గాడ్గే, అనంతుల రాంప్రసాద్, కొంగర నరహరి, విశ్వపతి, బత్తుల రాంనర్సయ్య, పర్వత సతీష్, కుంట విజయ్ కుమార్, దుబ్బకోటి ఆంజనేయులు, పంతుల మల్లయ్య, ఆది సంజీవ పటేల్, చింతలగారి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 

  ఈ పాదయాత్ర బృందానికి తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మట్టపెల్లి మల్లేష్ యాదవ్ డబ్బు వాయుద్యాలు, లంబాడీ కళాకారులతో తుంగతుర్తి క్రాస్ రోడ్ సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద ఘన స్వాగతం పలికారు. మారోజు పాండు, మారోజు అంజన్న, మారోజు సృజన కుటుంబం సాధరంగా స్వాగతం పలికి పాదయాత్ర నాయకులకు భోజనం ఏర్పాటు చేసి విరామ వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పత్తెపురం యాదగిరి, భువనగిరి లింగన్న, వెంకట్ యాదవ్, సర్గం మల్లన్న, ఎలగందుల మల్లేష్ నేత తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు