కవిత అరెస్టుపై ఇడి కీలక ప్రకటన - బంధువులు అడ్డగించారన్న ఇడి

 

కవితతో కెటిఆర్, హరీశ్ రావు ములాఖత్


కవిత అరెస్టుపై  ఇడి కీలక ప్రకటన - బంధువులు అడ్డగించారన్న ఇడి


ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని ప్రకటనలో వెల్లడి
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న ఈడీ
23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని స్పష్టీకరణ
ములాఖత్‌లో భాగంగా కవితను కలిసేందుకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై  ఈడీ సోమవారం ఓ కీలక  ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కీలక పాత్ర దారి అయిన కవితను ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని ఆ ప్రకటనలో పేర్కొంది. అరెస్ట్ చేసిన సమయంలో బంధువులు ఇబ్బందులు కలిగించారని తమ విధులను అడ్డగించారని పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను హాజరుపరిచామని 10 రోజుల పాటు రిమాండ్ చేస్తూ  ఆదేశాలు జారి చేశారని తమ విజ్ఞప్తి మేరకు ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలోవివరించింది.  ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది.

కోర్టు అనుమతి తీసుకొని తాము కవితను విచారిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వందల కోట్ల చెల్లింపులో కవితది కీలక పాత్ర అని పేర్కొంది. ఇప్పటి వరకు 240 చోట్ల సోదాలు చేశామని, 5 సప్లిమెంటరీ ఛార్జీషీట్లు దాఖలు చేశామని తెలిపింది. సోదాల్లో రూ.128 కోట్ల ఆస్తులను గుర్తించామని తెలిపింది. మనీష్ సిసోడియా సహా పలువురితో కవితకు లింకులు ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది.

ఈడి కార్యాలయంలో కవితను తల్సిన కేటీఆర్, హరీశ్ రావు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే  మాజి మంత్రి హరీశ్ రావు సోమవారం సాయంత్రం ఈడీ కార్యాలయంలో కవితను కలిసారు. కవితతో  విచారణ విషయాలు అడిగి తెల్సుకున్నారు. ములాఖత్‌లో భాగంగా వీరిద్దరు కవితను ఈడీ కేంద్ర కార్యాలయంలో కలవనున్నారు. కవితను ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతి ఉంది.  కవిత భర్త అనిల్ కుమార్ మాత్రం ఆమెను కలిసేందుకు రాలేదు. అనిల్ కుమార్ కూడ ఈ కేసులో విచారణకు రావాలని ఈడి నోటీసు జారి చేసింది. అయితే తాను విచారణకు హాజరు కాలేనని పది రోజుల వరకు విచారణకు రాలేనని అనిత్ కుమార్ ఈడికి లేఖ రాసారు.  అనిల్ కుమార్ వస్తే ఈడి ఆరెస్టు చేస్తుందన్న భయంతో హాజరు కానట్లు తెల్సింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు